RRR: ఇండియాలో కమర్షియల్ సినిమా అంటే… ఆస్కార్ అద్భుతం అంది

 RRR:  ఆర్ఆర్ఆర్ సినిమా ఇప్పుడు చరిత్ర సృష్టించింది. ఇండియా నుంచి ఆస్కార్ అవార్డు గెలుచుకున్న మొట్టమొదటి చిత్రంగా ఇది గుర్తింపు సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు అంతర్జాతీయ యువనికపై భారత జెండాని గర్వంగా పరిచయం చేసింది. అయితే ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్ఆర్ఆర్ మూవీని ఆస్కార్ నామినేషన్ కోసం పంపించినప్పుడు కమర్షియల్ సినిమా అంటూ అసలు కనీసం పరిగణంలోకి కూడా తీసుకోలేదు. దీని స్థానంలో చల్లో షో అనే గుజరాత్ సినిమాకి ప్రాధాన్యత ఇచ్చి ఆస్కార్ నామినేషన్ కోసం పంపించింది. అయితే ఓపెన్ కేటగిరిలో ఆస్కార్ పోటీలకు వెళ్ళిన ఆర్ఆర్ఆర్ సినిమా బెస్ట్ ఒరిజినల్ సాంగ్ క్యాటగిరి ఫైనల్ నామినేషన్ కోసం వెళ్ళింది.

ఇక అక్కడ సక్సెస్ అయ్యి ఆస్కార్ అవార్డును సొంతం చేసుకుంది. అయితే ఇండియాలో కమర్షియల్ సినిమా అంటే తిరస్కారణకి గురైన ఈ మూవీ అంతర్జాతీయ స్థాయిలో భారత గౌరవ నిలబెట్టింది. అలాగే ఇది ఇండియన్ సాంగ్ అని ప్రతి భారతీయుడు చెప్పుకునే స్థాయిలో గ్లోబల్ బజ్ క్రియేట్ చేసింది. ఆస్కార్ అకాడమీ అవార్డుల వేడుకలు నాటు నాటు లైవ్ పెర్ఫార్మన్స్ కి ఏకంగా హాలీవుడ్ అతిరథ మహారధులు అందరూ కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చి క్లాప్స్ కొట్టి ప్రశంసలు కురిపించారు.

దీని నేపథ్యం సోషల్ మీడియాలో ఇప్పుడు ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా సెలెక్షన్స్ సరిగా లేకపోవడం వలన భారతీయ సినిమా ఇప్పటివరకు ఆస్కార్ అవార్డులను గెలుచుకోలేదు అనే విమర్శలు కూడా ఇప్పుడు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఆర్ట్ మూవీలను మాత్రమే ఫిలిం ఫెడరేషన్ ఆస్కార్ అవార్డులకు పంపిస్తూ ఉండడం కూడా ఒక కారణం చెప్పాలి. మరి ఆర్ ఆర్ ఆర్ ఆస్కార్ గెలుచుకునే భవిష్యత్తులో ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మార్చుకుంటుందా అనేది చూడాలి.

Varalakshmi

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

2 days ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.