RRR For Oscar: దేశం అంతా కూడా ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా వైపు చూస్తుంది. ఇక తెలుగు సినిమా పాటకి అంతర్జాతీయ స్థాయిలో గౌరవం దక్కడానికి అడుగు దూరంలో ఉంది. నేరు ఆస్కార్ వేడుకలకి లాజ్ ఏంజిల్స్ వేదిక అవుతుంది. అందులో స్టేజ్ మీద ప్రపంచ స్థాయి అతిరథమహారథుల ముందు నాటు నాటు పాట వినిపిస్తుంది. అదే సమయంలో బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో పోటీ పడుతున్న ఈ పాటకి కూడా ఆస్కార్ పట్టం కడుతుంది అని అందరూ భావిస్తున్నారు. ఇక దేశంలో ప్రతి ఒక్కరు ఆర్ఆర్ఆర్ లో నాటు నాటు పాటకి ఆస్కార్ రావాలని కోరుకుంటున్నారు.
ఇక తెలుగు రాష్ట్రాలలో అయితే నాటు నాటు పాటకి ట్రిబ్యూట్ ఇస్తూ వీడియోలు చేస్తూ ఉండటం విశేషం. ఈ సాంగ్ కి అవార్డు వస్తే మాత్రం అది కచ్చితంగా చరిత్ర అవుతుంది. చరిత్ర సృస్టించడానికి సిద్ధమైన మన తెలుగు పాటని ప్రపంచం గుర్తించడానికి ఇంకా ఎంతో సమయం లేదు. అవార్డు వస్తే అదొక చరిత్ర, రాకపోయిన కూడా సంచలనమే అని చెప్పాలి. ఇక తెలుగు పాట ఆస్కార్ లో హాలీవుడ్ సాంగ్స్ తో పోటీ పడటం అంటే చిన్న విషయం కాదు. ఇక రాజమౌళి అద్భుత సృష్టి ఆర్ఆర్ఆర్ కి ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే.
గోల్డెన్ గ్లోబ్ అవార్డు కూడా ఇప్పటికే వరించింది. ఇదిలా ఉంటే ఈ ఆస్కార్ ప్రమోషన్ లో భంగా అమెరికాలో ఉన్న ఆర్ఆర్ఆర్ టీమ్ పలు అంతర్జాతీయ మీడియా చానల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. అలాగే ఆసక్తికరమైన విషయాలని కూడా పంచుకుంటున్నారు. ఇక ఈ సాంగ్ కి అవకాశం వస్తే మాత్రం రామ్ చరణ్, తారక్ ఒక్కసారిగా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకుంటారు, అలాగే రాజమౌళికి కూడా గ్లోబల్ ఇమేజ్ వస్తుంది. ఇక పాట పాడిన రాహుల్ సిప్లిగంజ్, కాల భైరవ,, మ్యూజిక్ అందించిన ఎంఎం కీరవాణి, లెరిక్స్ రాసిన చంద్రబోస్ అందరికి అరుదైన గుర్తింపు లభించినట్లు అవుతుంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.