RRR : ప్రముఖ సాహిత్య రచయిత చంద్రబోస్‌కు ఆర్ఆర్ఆర్ చిత్రంలో రాసిన “నాటు నాటు” పాటతో అరుదైన గౌరవం దక్కింది. పాన్ ఇండియన్ చిత్ర దర్శకుడిగా అసాధారణమైన పాపులారిటీని సంపాదించుకున్న రాజమౌళి దర్శకత్వంలో అత్యంత భారీ స్థాయిలో రూపొందిన ఆర్ఆర్ఆర్ (రణం రౌద్రం రుధిరం) ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే ఎన్నో ప్రశంసలు అవార్డులు దక్కించుకుంది. ఆస్కార్ అవార్డ్ నామినేషన్ వరకు వెళ్ళిన ఈ మూవీ ఖచ్చితంగా ఈ ప్రతిష్ఠాత్మక అవార్డ్ అందుకుంటుందని తెలుగు సినీ ప్రేమికులే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతీ ఒక్కరూ ఆశిస్తున్నారు.
అయితే, ఇప్పటికే నాటు నాటు పాటకి ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ పురస్కారం దక్కింది. అలాగే, హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ (హెచ్.సి.ఏ) పురస్కారం కూడా దక్కడమే కాక గొప్ప ప్రశంసల్ని అందుకుంటోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ పాట రాసిన సాహిత్య రచయిత చంద్రబోస్‌కి ప్రతిష్ఠాత్మక ‘ది సొసైటీ ఆఫ్ కంపోజర్స్ అండ్ లిరిసిస్ట్స్’ (ఎస్.సి.ఎల్) లో స్థానం దక్కడం మరో గొప్ప విశేషం. ఈ అరుదైన గౌరవం దక్కించుకున్న వేటూరి సుందరరామమూర్తి, సిరివెన్నెల సీతారామశాస్త్రిల తర్వాత మన తెలుగు సినిమా పాటకి, సాహిత్యానికి ఈ గొప్ప గౌరవం.. గుర్తింపు తెచ్చిన మన భారతీయుడు చంద్రబోస్ కావడం గొప్ప విషయం.
ఒక భారతీయ చిత్రంలోని పాట ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో నామినేట్ అవడం చరిత్రలో ఇదే మొదటిసారి. భారతీయ లేదా తెలుగు సినిమాల నుండి హాలీవుడ్ వాళ్లు సంగీత సాహిత్యాలు అనేది ఇది ప్రారంభం మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్, ప్రేక్షకులు, అభిమానులు ‘నాటు నాటు..’కు డ్యాన్సులు చేయడం చూసి చంద్రబోస్ ఎంతో ఆనందంగా గడుపున్నారు. తెలుగు భాష అంతగా పరిచయం లేకపోయినప్పటికీ పాశ్చాత్య ప్రేక్షకులు కూడా ఈ పాటకు డాన్స్ చేస్తూ ఆనందపడుతున్నారు. విదేశీయులు ఇతర భారతీయ ప్రేక్షకులతో కలిసి నాటు నాటు పాటకి చేశారు. ఇది ఎంతో ఆసక్తికరమైన విషయం.
ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ పాట కోసం చంద్రబోస్ కేవలం 45 నిమిషాల సమయం మాత్రమే తీసుకున్నారట. చంద్రబోస్ – సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి మొదటి రోజులోనే 90 శాతం పాట విషయంలో ఒక స్పష్ఠతకు రాగలిగారట. నాటు నాటు డ్యాన్స్ సీక్వెన్స్ ని చిత్రీకరించడానికి చాలా సమయమే పట్టిందట. చిత్ర దర్శకుడు ఎస్ ఎస్ రాజమౌళికి ఈ పాట రిహార్సల్ కోసం 30 రోజులు.. ఆతర్వాత పాట చిత్రీకరించడానికి మరో 30 రోజులు సమయం పట్టిందట. ఇంత కష్టపడ్డారు కాబట్టే ఈరోజు ఈ పాటకి ఇన్ని అవార్డులు..ఇంత గౌరవం దక్కాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.