Renu Desai : మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి షురూ అయ్యింది. టాలీవుడ్ అందగత్తె నటి లావణ్యకు మెగా బ్రదర్ నాగబాబు కొడుకు , యుంగ్ హీరో వరుణ్ తేజ్ పెళ్లి ఫిక్స్ అయిన విషయం అందరికి తెలిసిందే. గత కొంతకాలంగా లావణ్య త్రిపాఠితో వరుణ్ ప్రేమాయణం సాగిస్తున్నాడు.నిహారిక పెళ్లిలోనే ఆ విషయం బయటపడింది. ఎట్టకేలకు ఇన్నాళ్ల తమ లవ్ ను వరుణ్ పెళ్లి పీటల వరకు తీసుకువచ్చాడు. వీరి పెళ్లికి రెండు ఫ్యామిలీలు అంగీకరించడంతో..మెగా ఇంట్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి.
ఇటలీలో నవంబర్ 1న ఫ్యామిలీ మెంబెర్స్ సమక్షంలో వరుణ్ తేజ్ – లావణ్య త్రిపాఠిలు ఏడు అడుగులు వేయబోతున్నారు. ఈ వివాహాన్ని ఇటలీలో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేయడానికి మెగా ఫ్యామిలీ మొత్తం రెడీ సిద్దం అయ్యింది. ఇప్పటికే మెగా కుటుంబ సభ్యులతో పాటు అల్లు వారి ఫ్యామిలీ ఇటలీ చేరుకుంది. వరుణ్ పెద్దనాన్న మెగాస్టార్ చిరంజీవి,బాబాయ్ పవన్ తో సహా రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, అల్లు అర్జున్ ఇలా మెగా హీరోలందరూ ఇటలీకి చేరుకున్నారు.
వరుణ్ బాబాయ్ పవన్ కల్యాణ్ కూడా తన వైఫ్ కలిసి ఇటలీకి వెళ్లారు. ఇదిలా ఉండగా వరుణ్ తేజ్ వివాహం గురించి పవన్ కల్యాణ్ మాజీ భార్య నటి రేణు దేశాయ్ లేటెస్టుగా స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. వరుణ్ తేజ్ పెళ్లికి తనకు కూడా పిలుపు అందిందని తెలిపింది. అయితే ఆ వివాహానికి తాను వెళ్లడం లేదని రేణు దేశాయ్ చెప్పింది.నిహారిక పెళ్లికి తనకు ఇన్విటేషన్ వచ్చిందని..అందుకే పిల్లల్ని పంపించాను కాని తాను మాత్రం వెళ్లలేదని రేణు దేశాయ్ తెలిపింది.
” వరుణ్ తేజ్ పెళ్లికి ఇన్విటేషన్ వచ్చింది కాని, నేను వెళ్లాలని అనుకోవడం లేదు. వరుణ్ కి నాకు మంచి రిలేషన్ ఉంది. తన ఎనిమిదేళ్ల వయస్సు నుంచి నేను వరుణ్ ని చూస్తున్నాను. నా కళ్ల ముందే వరుణ్ పెరిగాడు.నేను వరుణ్ పెళ్లికి వెళ్లకపోయిన.. నా బెస్ట్ విషెష్ ఎప్పుడు ఉంటాయి” అని రేణు దేశాయ్ వెల్లడించింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.