Technology: ప్రపంచ వ్యాప్తంగా కరోనా విపత్తు వచ్చిన తర్వాత ఉద్యోగస్తులు వర్క్ ఫ్రమ్ హోమ్ కి అలవాటు పడిపోయారు. అలాగే విద్యార్థుల చదువులు కూడా తరగతి గదుల నుంచి డిజిటల్ ప్రపంచంలోకి వచ్చేశాయి. ప్రయివేట్ స్కూల్స్ నుంచి ప్రభుత్వం పాఠశాలల వరకు విద్యార్థులు పూర్తిగా చదువులకి దూరం కాకుండా ఆన్ లైన్ క్లాస్ లు చెప్పడం స్టార్ట్ చేశాయి. అలాగే పిల్లల చదువుల కోసం ప్రత్యేకంగా ఆన్ లైన్ క్లాస్ ని చెప్పే యాప్స్ కూడా మార్కెట్ లోకి వచ్చాయి.
అలాగే కంపెనీల అంతర్గత మీటింగ్స్ కోసం రూపొందించిన జూమ్, గూగుల్ మీట్ వంటివి ఆన్ లైన్ తరగతులు చెప్పడానికి ఉపయోగపడ్డాయి. అయితే ఈ పద్ధతి వలన మరింత అడ్వాన్స్ గా విద్యార్ధులకి చదువులు అందుతున్నాయి. అంత వరకు బాగానే ఉంది. అయితే ఈ టెక్నాలజీ మాటున చాలా కంపెనీలు ప్రైవసీకి భంగం కలిగించే విధంగా వ్యక్తిగత డేటాని అడ్వార్టైజింగ్ కంపెనలకి అమ్ముకుంటున్నాయి. ముఖ్యంగా ఆన్ లైన్ క్లాస్ ల కోసం విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని కొన్ని యాప్స్ కి ఇవ్వాల్సి ఉంటుంది.
అయితే ఈ వ్యక్తిగత సమాచారాన్ని పూర్తిస్థాయి భద్రత కల్పిస్తామని ఆయా కంపెనీలు హామీ ఇస్తాయి. అయితే ఈ హామీని అతిక్రమిస్తూ ఇప్పుడు విద్యార్థుల వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్నట్లు హ్యూమన్ రైట్స్ వాచ్ తన నివేదికలో పేర్కొన్నాయి. ఆన్ లైన్ లెర్నింగ్ యాప్ లు, పిల్లల డేటాని అనుమతి లేకుండా సేకరిస్తూ థర్డ్ పార్టీ కంపెనీలకి విక్రయిస్తున్నట్లు వారు కనుగొన్నారు. ఈ సంస్థ 49 దేశాలలో 150 కంటే ఎక్కువ ఎడ్యుకేషన్ రిలేటెడ్ టెక్నీకల్ ఉత్పత్తులని పరిశీలించాయి. వీటిలో 89 శాతం ఉత్పత్తులు పిల్లల డేటాని తస్కరిస్తున్నట్లు గుర్తించారు. చాలా ఎడ్యుకేషన్ టెక్ ఉత్పత్తులు పిల్లల సామర్ధ్యానికి పర్యవేక్షించడానికి ట్రాకింగ్ టెక్నాలజీని వినియోగిస్తున్నాయి.
ఈ టెక్నాలజీ సాయంతో విద్యార్థుల డేటాని యాప్స్ లో స్టార్ట్ చేసిన తర్వాత వాటిని తీసుకొని థర్డ్ పార్టీ కంపెనీలకి విక్రయిస్తున్నాయి. ఇలా డేటాని 196 థర్డ్ పార్టీ కంపెనీలకి పంపుతున్నాయని హ్యూమన్ రైట్స్ వాచ్ సంస్థ పేర్కొంది. ఇప్పటికే చాలా యాప్స్ పర్సనల్ డేటాని ట్రాకింగ్ చేస్తూ తస్కరించి థర్డ్ పార్టీ కంపెనీలకి అమ్ముకుంటున్నాయని టాక్ ఉంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ టెక్ ఉత్పత్తులు కూడా ఇలాంటి అతిక్రమణలకి పాల్పడుతూ పిల్లల వ్యక్తిగత భద్రతకి కూడా విఘాతం కలిగిస్తున్నాయని ఈ నివేదిక బట్టి తెలుస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.