RC 15 : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బాలీవుడ్ క్రేజీ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్‌గా క్రియేటివ్ జీనియస్ శంకర్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్సీ 15. ఇది ప్రస్తుతానికి వర్కింగ్ టైటిల్ మాత్రమే. పరిశీనలో సీఈఓ అనే టైటిల్ ఉంది. ఇదే టైటిల్ గనక ఫిక్సైతే టైటిల్ సినిమాపై గ్యారెంటీగా భారీ అంచనాలను పెంచుతుంది. ఇక శంకర్ సినిమా అంటే ఖచ్చితంగా ఓ పదేళ్ళ అడ్వాన్స్‌గా కథ కథనాలు ఉంటాయి.
దేశంలో మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా 10ఏళ్ళ తర్వాత ఎలాంటి మార్పులు సంభవిస్తాయో వాటిని ఇప్పుడే చూపించేస్తారు. ఓ దర్శకుడు ఇంత అడ్వాన్స్‌గా ఆలోచించి సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఏ కథ ఎంచుకున్నా ఖచ్చితంగా అందులో సామాజిక అంశం ఉంటుంది. అదే శంకర్ కథా వస్తువు. ఆయన కెరీర్‌లో భారీ హిట్సే ఎక్కువ.
ఇలాంటి దర్శకుడు పాన్ ఇండియన్ స్టార్ రామ్ చరణ్ హీరోగా సినిమా అంటే అంచనాలను ఏ ఒక్కరూ ఊహించలేరు. ఈ సినిమాను నిర్మాత దిల్ రాజు కూడా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో రామ్ చరణ్, కియారా అద్వానీలపై ఓ విజువల్ వండర్ లాంటి సాంగ్‌ను తెరకెక్కిస్తున్నారు. దీనికి ఇండియన్ మైఖేల్ జాక్సన్, దర్శకుడు ప్రభుదేవా కొరియోగ్రఫీని అందించడం విశేషం.
భారీ డాన్సర్స్ ఈ పాటలో పాల్గొంటున్నారు. ఈ ఒక్క పాటకే ఖర్చు కూడా బాగానే పెడుతున్నారట. ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. శంకర్ సినిమాలో ఒక్కో సాంగ్ ఒక్కో విజువల్ వండర్‌లా ఉంటుంది. ఇప్పుడు ఆర్సీ 15 లో సాంగ్స్ వాటికంటే ఇంకో మెట్టు పైస్థాయిలో ఉండబోతున్నట్టు ఇప్పటికే టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా గనక పాన్ ఇండియన్ రేంజ్‌లో హిట్ సాధిస్తే ఇక అటు చరణ్ ఇటు శంకర్, దిల్ రాజుల రేంజ్ మరోలా ఉంటుందనడంలో సందేహమే లేదు.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.