Raviteja : మాస్ మహరాజ్ రవితేజ ఇండస్ట్రీ లో దూసుకెళ్తున్నాడు. కొన్నాళ్లుగా హిట్టు ఫ్లాప్ తో పనిలేకుండా.. వరుసగా సినిమాలు చేస్తూ ఫ్యాన్స్ కు ఎంటర్టైన్మెంట్ అందిస్తున్నాడు. రవితేజకు ఉన్న మాస్ మహరాజ ఇమేజ్ వల్లే ఇన్నాళ్లుగా ఇండస్ట్రీ లో నిలదొక్కుకుంటున్నాడు. వరుస డిజాస్టర్స్ చూసినా తన దూకుడు ఆపలేదు. డిఫరెంట్ స్టోరీస్ తో రూట్ మర్చి ముందుకు వెళుతున్నాడు. అయినా పాపం రవికి కలిసి రావడం లేదు. డైరెక్టర్ల వల్ల..వరుసగా ఫ్లాపులు చూస్తున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ, రావణాసుర సినిమాలు అలా బాక్స్ ఆఫీస్ దగ్గర పోయినవే. లేటెస్ట్ గా వచ్చిన టైగర్ నాగేశ్వరరావు కూడా రవికి పెద్దగా పేరు తేలేకపోయింది. నెగెటివ్ రివ్యూస్ వచ్చాయి అయినా మాస్ రాజా తన స్పీడ్ కంటిన్యూ చేస్తున్నాడు.
నిజానికి ఒక సినిమా అయిపోయిన తర్వాత దాని గురించి ఆలోచించడు రవితేజ. వాట్ నెక్స్ట్ అనేదానిపైనే ఫోకస్ పెడతాడు. ప్రస్తుతం కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో ఈగల్ అనే సినిమా చేస్తున్నాడుమాస్ రాజా . ఈ సినిమాను మేకర్స్ తెలుగువారి పండుగ సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఇక లేటెస్ట్ గా మరోసారి గోపీచంద్ మలినేనితో ఒక సినిమా చేస్తున్నాడు. గోపీచంద్ మలినేని, రవితేజ కాంబినేషన్ లో వచ్చిన డాన్ శీను, బలుపు, క్రాక్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. దీంతో ఈ సారి చేసే సినిమాపై మరిన్ని అంచనాలు ఉన్నాయి. మైత్రీ మూవీస్ బ్యానర్ లో ఈ చిత్రం రాబోతోంది. ఈ సినిమా 2024 వేసవి సీజన్లో లేదా ఆ తర్వాత మొదలవుతుందట.
ఇక్కడితో ఆగలేదు రాజా మాస్ డైరెక్టర్ వివి వినాయక్ తో సినిమా చేయబోతున్నాడు అనే న్యూస్ ఇండస్ట్రీ లో వినిపిస్తోంది . వీరి కాంబోలో వచ్చిన కృష్ణ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్ గా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం వినాయక్ ఫామ్ లో లేడు. అయినా రవితేజ వినాయక్ కి ఒక ఛాన్స్ ఇచ్చాడు. ఈ సినిమా కూడా షూటింగ్ ప్రారంభం అయితే నాన్ స్టాప్ షూటింగ్ తో పూర్తి చేసేలా ప్లాన్ చేసుకున్నాడు. దీనిని బట్టి చూస్తే 2024లో రవితేజ నటించే మూడు సినిమాలు ఖచ్చితంగా విడుదలవుతాయి. ఏదేమైనా ఈ స్పీడ్ వల్ల అప్పుడప్పుడూ కంటెంట్ మైనస్ అవుతుంది. అది కూడా కాస్త చూసుకుంటే..రవితేజకు, ఫిల్మ్ మేకర్స్ కు కాసులు కూడా వస్తాయి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.