Rashmika Mandanna : సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా డీప్ఫేక్ వీడియో కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయ్యింది . మార్ఫింగ్ వీడియోలను ఇలా పోస్ట్ చేయడం అత్యంత ప్రమాదకరమైన చర్యగా కేంద్రం అభివర్ణించింది. ఇలాంటి వీడియోలను కట్టడి చేయాల్సిన బాధ్యత సంబంధిత సోషల్ మీడియాలదేనని క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు అడ్వైజరీ జారీచేసింది.
కేంద్ర ఐటీశాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందిస్తూ..” ఐ టీ యాక్ట్ 2000, సెక్షన్ 66డీ ప్రకారం కంప్యూటర్ వనరులను ఉపయోగించి పర్సనల్ ఇమేజ్ ను డ్యామేజ్ చేసే ప్రయత్నం చేస్తే మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది. రూ.లక్ష వరకు ఫైన్ కూడా విధిస్తారు. సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు చట్టాన్ని అనుసరించి వ్యవహరించాలి. యూజర్లు ఫేక్ ఇన్ఫర్మేషన్ పోస్టు చేయకుండా చూడాలి. ఒకవేళ ఫేక్ వీడియో పోస్టు చేసినా, దాన్ని 36 గంటల్లోగా డిలీట్ చేయాలి. రూల్స్ పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవు అని మినిస్టర్ హెచ్చరించారు.
సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ప్రస్తుతం సౌత్ స్టార్ బ్యూటీ రష్మికకు సంబంధించిన ఓ వీడియో తెగ హల్ చల్ చేస్తోంది. డీప్ నెక్ తో ఉన్న టీ షర్ట్ లో రష్మిక ఎక్స్పోజింగ్ చేస్తున్న ఈ వీడియో ప్రస్తుతం పెద్ద సెన్సేషన్ గా మారింది. కొంతమంది ఆకతాయిలు రష్మిక ను ట్రోల్ చేసేందుకు చేసిన వీడియో ఇది. దీంతో ఈ వీడియో కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రష్మిక ఫొటోను మార్ఫింగ్ చేసి ఓ అసభ్యకర వీడియోను సృష్టించారు.
ఈ విషయంపై ఇప్పటికే నేషనల్ క్రష్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. సినీ రాజకీయ ప్రముఖులతో పాటు నెటిజన్లు కూడా రష్మికను సపోర్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు. దీనిపై లీగల్ కేసు నమోదు చేయాలని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టెక్నాలజీ దుర్వినియోగాన్ని చూస్తుంటే ఫ్యూచర్ పై భయం వేస్తోందని తాజాగా అక్కినేని నాగచైతన్య ఈ వీడియోపై స్పందించాడు. ఇంతమంది తనకు అండగా నిలవడంపై రష్మిక మందన్నా కృతజ్ఞతలు తెలిపింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.