Devi Sri Prasad: @5 కోట్లు..అదీ అసలు రేంజ్

Devi Sri Prasad: టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో రాక్ స్టార్‌గా దేవి శ్రీ ప్రసాద్ కి ఎంతటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన ఒక సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నారంటే ఆ సినిమా ఖచ్చితంగా మ్యూజికల్ గా హిట్ అని ఫిక్స్ అవ్వాల్సిందే. ఒకదశలో దేవి శ్రీ కోసం పెద్ద హీరోలు కూడా వెయిట్ చేశారు. అయితే, థమన్ ఫాంలోకి వచ్చాక దేవి శ్రీ హవా కొద్దిగా తగ్గింది.

హీరోలందరూ థమన్ వైపు టర్న్ తీసుకున్నారు. కాస్త దేవి శ్రీకి దెబ్బ పడిందనే చెప్పాలి. కానీ, ‘పుష్ప’..’ఉప్పెన’ సినిమాలు మళ్ళీ రాక్ స్టార్ ని ఫాంలోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా పుష్ప పాన్ ఇండియన్ స్థాయిలో సక్సెస్ కావడానికి సగం క్రెడిట్ దేవి శ్రీ ప్రసాద్ కి ఇచ్చారు. అదే సమయంలో థమన్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ బాగా ఇస్తున్నా సాంగ్స్ విషయంలో ప్రతీసారి ట్రోల్స్ ఎదుర్కుంటున్నారు.

devi-sri-prasad-5-@5 crores..that is the actual range

Devi Sri Prasad: థమన్, దేవి శ్రీల మధ్య ఠఫ్ కాంపిటీషన్

కాపీ క్యాట్ అనే కామెంట్స్ బాగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు థమన్, దేవి శ్రీల మధ్య ఠఫ్ కాంపిటీషన్ ఉంది. రెమ్యునరేషన్ పరంగా మాత్రం థమన్ కంటే దేవి శ్రీకే ఎక్కువ ఉందని ఇండస్ట్రీ వర్గాలో టాక్ ఉంది. ప్రస్తుతం డీఎస్పీ చేతిలో అరడజను సినిమాలున్నాయి. వాటిలో పుష్ప 2, నాగ చైతన్య-చందు మొండేటి సినిమా, పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమా ఉన్నాయి.

అలాగే, తమిళంలో సూర్య హీరోగా శివ రూపొందించబోతున్న పాన్ ఇండియా సినిమా, శేఖర్ కమ్ముల, ధనుష్ కాంబోలో మొదలబోతున్న మరో పాన్ ఇండియా సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ ఫిక్స్ అయ్యారట. ఈ సినిమాలలో ఒక్కోదానికి రాక్ స్టార్ 5 కోట్ల వరకూ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారట. ఎం ఎం కీరవాణి తర్వాత టాలీవుడ్ లో ఇంత హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ అని టాక్ వినిపిస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.