Rashmika Mandanna: సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన ఇమేజ్ ఇప్పుడు హై లెవల్ లో ఉంది. ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో పుష్ప 2తో పాటు హిందీలో యానిమల్ సినిమాలు చేస్తోంది. ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉన్నాయి. పుష్పతోనే రష్మిక మందన పాన్ ఇండియా స్టార్ గా మారిపోయింది.
తరువాత బాలీవుడ్ లో కూడా ఇప్పటికే రెండు సినిమాలు పూర్తి చేసింది. మరో వైపు సోషల్ మీడియాలో రష్మిక మందన ఫాలోయింగ్ స్ట్రాంగ్ గానే ఉంది. ఇన్స్టాగ్రామ్ లో అత్యధిక ఫాలోవర్స్ ఉన్న సౌత్ ఇండియన్ స్టార్ గా రష్మిక మందన ఉంది.
ఇదిలా ఉంటే ఈ అమ్మడు సోషల్ మీడియాలో మోస్ట్ యూత్ క్రష్ గా ఇప్పటికే అరుదైన గుర్తింపుని కలిగి ఉంది. ఇప్పుడు మరో క్రేజీ ఇమేజ్ ని ఈ బ్యూటీ సొంతం చేసుకుంది. ఈ వారం ప్రముఖ ఐఎండిబి సంస్థ వెల్లడించిన పాపులర్ ఇండియన్ సెలబ్రిటీస్ లిస్ట్‌లో రష్మిక మందన చోటుదక్కించుకుంది.
భారతదేశంలో థర్డ్ హైయెస్ట్ పాపులారిటీ ఉన్న సెలబ్రిటీగా నిలిచింది. దీనిని రష్మిక మందన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. ఈ నెలలో పుష్ప 2 మూవీ టీజర్ రిలీజ్ కావడం, అలాగే రష్మిక మందన ఐపీఎల్ ప్రారంభోత్సవంలో పాల్గొనడం జరిగింది.
దీంతో పాటు నితిన్, వెంకి కుడుముల కాంబినేషన్ లో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే రెయిన్ బో అనే బై లింగ్వల్ మూవీకి కూడా రష్మిక మందన ఒకే చెప్పి లాంచింగ్ కార్యక్రమంలో పాల్గొంది. ఇలా ఈ నెలలో ఫుల్ బజ్ లో ఉండటంతో రష్మిక మందన అత్యంత పాపులారిటీ ఉన్న సెలబ్రిటీగా గుర్తింపు తెచ్చుకోవడం విశేషం.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.