Rashmika Mandanna : నేషనల్ క్రష్ రష్మిక మందన్న పేరు చెప్పగానే చాలామంది మైండ్ లో వెంటనే రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ గుర్తొచ్చేస్తాడు. ఎందుకంటే వీళ్లిద్దరి గురించిన వార్తలు ఎప్పుడూ సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. వీళ్లిద్దరూ ఫ్రెండ్సా? లవర్సా? అనేది ఇప్పటికీ ఓ సస్పెన్సే. రష్మిక, విజయ్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారని ఎప్పటికప్పుడు నెట్టింట్లో వార్తలు వస్తూనే ఉంటాయి. వీరిద్దరు దిగిన ఫోటోలను కూడా వైరల్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే లేటెస్టుగా విజయ్ తమ్ముడు ఆనంద్ దేవరకొండ గం గం గణేశా అనే ఓ కొత్త కామెడీ మూవీతో అలరించేందుకు రెడీ అవుతున్నాడు. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ కు రష్మిక స్పెషల్ గెస్టుగా వచ్చింది. ఆనంద్ తో చేసిన సరదా చిట్ చాట్ లో విజయ్‌తో తనకున్న బాండింగ్ గురించి ఓ క్లారిటీ ఇచ్చేసింది ఈ భామ.
బేబీ సూపర్ హిట్ తర్వాత ఆనంద్ దేవరకొండ చేస్తున్న మూవీ ‘గం గం గణేశా’. మే 31న ఈ సినిమా థియేటర్లలోకి విడుదల కానుంది. ఈ క్రమంలోనే తాజాగా హైదరాబాద్‍లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు మేకర్స్. దీనికి చీఫ్ గెస్టుగా రష్మిక వచ్చింది. సరదాగా ఆనంద్ దేవరకొండ అడిగిన ప్రశ్నలకు కూల్ గా జవాబులు ఇచ్చి ఫ్యాన్స్ ను ఇంప్రెస్ చేసింది. సోషల్ మీడియాలో రష్మిక పోస్ట్ చేసిన పెట్ డాగ్స్ పిక్స్ చూపించి, వీటిలో ఏ కుక్క నీకు బాగా ఇష్టమని అడిగాడు. దీంతో ఆరా నా ఫస్ట్ బేబీ, స్టార్మ్ నా సెకండ్ బేబీ అని ఆన్సర్ ఇచ్చింది.
ఆ తర్వాత నీ ఫేవరెట్ కో స్టార్ ఎవరు? అని అడిగాడు ఆనంద్. దీంతో ఆనంద్‌ని సరదాగా తిట్టి .. ఆ వెంటనే మైక్ లో.. ఆనంద్ నువ్వు నా ఫ్యామిలీరా అని అని ఇలా స్పాట్‌లో పెడితే ఎలా అని అంటుంది. దీంతో ఈవెంట్‌కి వచ్చిన వారంతా రౌడీ, రౌడీ స్టార్ అని గట్టిగట్టిగా అరిచారు. దీంతో రౌడీ బాయే నా ఫేవరేట్ అని విజయ్‌ని ఉద్దేశించి రష్మిక ఆన్సర్ ఇచ్చేసింది. ఇలా రష్మిక-విజయ్ ఎంత క్లోజ్ అనేది మరోసారి రుజువైంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.