Rangamarthanda Movie Review : చిత్రం : రంగమార్తాండ
నటీనటులు : ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, శివాత్మికా రాజశేఖర్, రాహుల్ సిప్లిగంజ్, ఆదర్శ్ బాలకృష్ణ, అనసూయ తదితరులు
సంగీతం : ఇళయరాజా
మాటలు : ఆకెళ్ళ శ్రీనివాస్
ఛాయాగ్రహణం : రాజ్ కె. నల్లి
నిర్మాతలు : కాలిపు మధు, ఎస్. వెంకట్ రెడ్డి
దర్శకత్వం : కృష్ణవంశీ
కథ:
Rangamarthanda Movie Review : నాటకరంగమే తన ప్రపంచంగా బ్రతికిన రాఘవరావు (ప్రకాష్‌రాజ్) ఆయన ముద్దుగా రాజుగారు అని పిలుచుకునే పాత్రలో రమ్యకృష్ణ నటించారు. రంగస్థలంపై ఎన్నో అద్భుతమైన పాత్రలకి జీవం పోసిన రాఘవరావుకి స్నేహితుడు చక్రపాణి (బ్రహ్మానందం). వీరిద్దరూ కలిసి ప్రపంచ దేశాలలో ఎన్నో నాటక ప్రదర్శనలిచ్చి జేజేలు కొట్టించుకుంటారు. నాటకరంగం లోనే కాకుండా జీవితంలోనూ ఒకరి కష్టసుఖాలను మరొకరు పంచుకుంటారు. నాటకరంగంలో రాఘవరావు చేసిన కృషికి రంగమార్తండ బిరుదు దక్కుతుంది. ఆ సమయంలోనే తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తారు రాఘవరావు. అంతేకాదు, అప్పటివరకూ ఆయన సంపాదించదంతా తన వారసులకి ప్రకటిస్తారు. ఆ తర్వాత రాఘవరావు జీవితం ఎటువైపు సాగింది..ఆయన ఎలాంటి కష్టాలను అనుభవించాడు, చక్రపాణి ఎందుకు అసహ్యించుకుంటాడు..జీవితమనే నాటకంలో రాఘవరావు గెలిచాడా లేదా అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే.
అమ్మా నాన్నల కథకి నాటకరంగం అనే ఇతి వృత్తాన్ని జోడించి ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చిన సినిమానే రంగమార్తాండ. ఈ కంప్యూటర్ కాలంలో అమ్మా నాన్నలను పిల్లలు ఎంత బాధ్యతగా చూసుకోవాలి అనేది కృష్ణవంశీ చాలా బలంగా చెప్పారు. ఆయన మార్క్ ఎమోషన్స్ అన్నీ అద్భుతంగా కుదిరాయి. కృష్ణవంశీ రాసుకున్న పాత్రల్లో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, అనసూయ, శివాత్మిక సహా మిగిలిన వారందరూ అద్భుతంగా నటించారు. మరీ ముఖ్యంగా ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం పాత్రలు కంట నీరు పెట్టిస్తాయి. మామూలు కమర్షియల్ సినిమాలకి భిన్నంగా ఉండే కృష్ణవంశీ సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. అలాంటి ఎమోషన్స్ రంగమార్తాండ సినిమా చూసి బయటకి వచ్చాక కూడా ప్రేక్షకులను వెంటాడుతూనే ఉంటాయి.
తనకి నచ్చినట్టు బ్రతికిన రాఘవరావు పిల్లలు పెద్దయ్యాక మాత్రం వారి పద్ధతులకి, ఆలోచనలతో కలవలేక సతమతయ్యే సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటాయి. నాటి తరానికి నేటి తరానికి మధ్య భిన్న అభిప్రాయాలు..ఒకే ఇంట్లో ఉంటున్నా ఎవరి ఆలోచనా ధోరణి వారిది. కానీ, ఎవరి ఆలోచన వారికి సమంజసం అనిపిస్తుంది. ఇలాంటి నేపథ్యంలో సన్నివేశాలను చూపించిన విధానంలో కృష్ణవంశీ సక్సెస్ అయ్యారు. సాధారణంగా ఇలాంటి కథా నేపథ్యం ఎంచుకోవడం కత్తి మీద సాము. పైగా ఇప్పటికే ఈ కథ అందరూ చూసింది..తెలిసింది. అయినా ఎక్కడా కూడా స్క్రీన్ ప్లే లో గ్రిప్ తగ్గకుండా అద్భుతంగా రాసుకున్నారు.
మన తెలుగు నాటకాలను షేక్‌స్పియర్ నాటకాలతో పోల్చి చూపించడం మరో హైలెట్. ఇక ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ఇంటి నుంచి బయటకి వచ్చి రోడ్డు పక్కన పడుకునే సన్నివేశాలు, ప్రకాష్ రాజ్..బ్రహ్మానందం మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాను మరో లెవల్‌కి తీసుకెళ్ళాయి. కొన్ని సన్నివేశాలు చూస్తుంటే మొరటు గుండె కూడా కరిగిపోతుంది. అంత ఎమోషనల్‌గా చూపించారు కృష్ణవంశీ. తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే పక్కా మాస్ ఎంటర్‌టైనర్స్, ఫ్యాన్ బేస్డ్ సినిమాలే ఆదరిస్తారు అనుకున్న మాటను కృష్ణవంశీ రంగమార్తాండ తో తిప్పికొట్టారు. మొత్తానికి రంగమార్తాండతో ఆయన సత్త మరోసారి చూపించారు.
నటీనటులు:
ప్రకాష్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం లేకపోతే రంగమార్తానడ లేదని ఖచ్చితంగా చెప్పొచ్చు. వారే సినిమాకి ప్రధాన బలం. మిగిలిన పాత్రలు చక్కగా కుదిరాయి. రమ్యకృష్ణ పాత్రకి డైలాగ్స్ తక్కువైనా కళ్ళతోనే సన్నివేశాలను రక్తికట్టించారు. అనసూయ చాలా ఏళ్ళు గుర్తుండిపోయే పాత్రను చేసింది.
టెక్నీషియన్లు:
మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా సంగీతం రంగమార్తాండ సినిమాకి ఆయువుపట్టు. ఆయన నేపథ్య సంగీతంతో కంటనీరు తెప్పించారు. ఆకెళ్ళ శివ ప్రసాద్ రాసిన డైలాగ్స్ బాగా కుదిరాయి. రాజ్ కె నల్లి అందించిన సినిమాటోగ్రఫీ చాలా నేచురల్‌గా ఉంది. ముఖ్యంగా నాటకం ప్రదర్శించే సమయంలో వాడిన లైటింగ్ హైలెట్.
ఫైనల్‌గా:
నాతెలుగు.com రేటింగ్: 3.5
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.