Ram Charan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వం తన 15వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సుమారు 200 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. దిల్ రాజు ఈ మూవీని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. దీని తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో 16వ సినిమాని చేయబోతున్నాడు. ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ అనే సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే తాజాగా మరో యాక్షన్ అడ్వంచర్ కథకి ఒకే చెప్పినట్లు తెలుస్తుంది.
గత కొంత కాలంగా రామ్ చరణ్ కన్నడంలో మఫ్టీ అనే సినిమాతో పరిచయం అయిన ప్రశాంత్ నీల్ శిష్యుడు నార్తన్ దర్శకత్వంలో సినిమా చేస్తాడనే టాక్ వినిపిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా నార్తన్ చెప్పిన యాక్షన్ అడ్వంచర్ స్టొరీ లైన్ కి రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు సమాచారం. ఈ మూవీ రామ్ చరణ్ 17వ సినిమాగా తెరకెక్కే ఛాన్స్ ఉందనే మాట వినిపిస్తుంది. ఈ ఏడాదిలోనే దీనిని కూడా స్టార్ట్ చేయనున్నట్లు సమాచారం. ఇక దీని తర్వాత సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ తో ఒక సినిమా చేయడానికి ఎప్పుడో కమిట్ అయ్యాడు.
ఈ సినిమాని సుకుమార్ యూనివర్స్ లో భాగంగా పుష్ప లాంటి కాన్సెప్ట్ తోనే చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. దాని తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ లో ఒక సినిమా ఉండనుంది. దీంతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కూడా లోకేష్ యూనివర్స్ కాన్సెప్ట్ లలో భాగంగా ఒక మూవీలో రామ్ చరణ్ నటిస్తాడని తెలుస్తుంది. ఇలా ఏకంగా గ్యాప్ లేకుండా శంకర్ సినిమా తర్వాత ఐదు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ని రామ్ చరణ్ ఫైనల్ చేశాడు అనేది ఇండస్ట్రీలో వినిపిస్తున్న మాట. వీటిలో ఒక్కో ప్రాజెక్ట్ 100 కోట్ల నుంచి 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్నవే కావడం విశేషం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.