Samyuktha Menon : మలయాళ బ్యూటీ సంయుక్త మేనన్ తన పేరు చివరిలో ఉన్న సర్ నేమ్ (ఇంటిపేరు) ను తొలగించింది. దీనికి ఆమె చెప్పిన కారణం, లాజిక్ వింటే ఇలా కూడా ఆలోచించేవారున్నారా..? అనిపిస్తుంది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్‌గా మంచి క్రేజ్ ఉన్న సంయుక్త మేనన్..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నిత్యా మీనన్ మరో ముఖ్య పాత్రలో వచ్చిన ‘భీమ్లా నాయక్’ సినిమాతో తెలుగు తెరకి పరిచయమైంది.
ఈ సినిమాలో సంయుక్త మేనన్ తన పర్ఫార్మెన్స్‌తో టాలీవుడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత తెలుగులో మంచి క్రేజ్ వచ్చి కొత్త చిత్రాలను కమిటవుతోంది. ప్రస్తుతం ధనుష్ హీరోగా తెలుగు-తమిళ భాషలలో రూపొందుతున్న సార్ అనే సినిమాలో హీరోయిన్‌గా నటించింది. ఇందులో బయాలజీ లెక్చరర్‌గా కనిపించబోతుంది సంయుక్త మేనన్. అయితే, తాజాగా సోషల్ మీడియాలో తను పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది.
ఇంతకాలం సంయుక్త మేనన్ అంటూ పేరు చెప్పిన ఈ మలయాళ బ్యూటీ ఇకపై కేవలం సంయుక్తగానే పిలవమంటూ క్లారిటీ ఇచ్చింది. తన పేరు చివరిలో ఉన్న సర్ నేమ్మ్ ని తొలగించినట్టుగా తెలుపుతూ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఈ ఆలోచన ఎప్పటినుంచి ఉందని..కానీ, ఇప్పుడు దాన్ని అమలు చేసినట్టుగా వెల్లడించింది. మరి ఎందుకు ఇలా తొలగించాలనిపించిందో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. ఇక సినిమాల పరంగా కథ, నా పాత్రలో వైవిధ్యం ఉంటేనే కమిటవుతానంటూ చెప్పుకొచ్చింది. ఆ విషయం సార్ ట్రైలర్, పోస్టర్స్‌లో సంయుక్త హుందాతనం చూస్తేనే అర్థమవుతోంది.
Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…
Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
This website uses cookies.