Ram charan: మెగా పవర్ స్టార్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న నటుడు రామ్ చరణ్. మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా చిరుత సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టిన రామ్ చరణ్ మొదటి చిత్రం చిరుత తోనే బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇక రెండో సినిమాని రాజమౌళి దర్శకత్వంలో చేశారు. మగధీరగా వచ్చిన ఆ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన మగధీరుడు అనిపించుకున్నాడు. ఇక మూడో సినిమాని ఆరెంజ్ గా ప్రేమ కథతో చేసిన అది ఆశించిన స్థాయిలో ప్రేక్షకులకు రీచ్ కాలేదు. అయితే ప్రస్తుతం ఆరెంజ్ సినిమా టాలీవుడ్ లో క్లాసిక్ మూవీస్ లో ఒకటి నిలిచిపోయింది.
తర్వాత రచ్చ, నాయక్ సినిమాలతో కమర్షియల్ హీరోగా తనని తాను ఎస్టాబ్లిష్ చేసుకున్నాడు. ఇక హిందీలో తుఫాన్ సినిమా చేసి కెరియర్ లో డిజాస్టర్ కొట్టడంతో పాటు విమర్శలు కూడా ఎదుర్కొన్నారు. రామ్ చరణ్ కు యాక్టింగ్ రాదంటూ బాలీవుడ్ క్రిటిక్స్ ఆ సినిమాను దారుణంగా ట్రోల్ చేశారు. ఆ తర్వాత తెలుగులో ఎవడు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. రంగస్థలం సినిమాతో నటుడిగా తనపై ఉన్న విమర్శలు అన్నింటికీ రామ్ చరణ్ సమాధానం చెప్పాడు. కెరియర్ లోనే బెస్ట్ పెర్ఫార్మన్స్ ని ఆ సినిమా ద్వారా రామ్ చరణ్ ఇవ్వడం విశేషం. ఇక ఆర్ఆర్ఆర్ సినిమా రామ్ చరణ్ కెరియర్ లో నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి.
ఈ సినిమాలో రామ్ చరణ్ పెర్ఫార్మన్స్ కి హాలీవుడ్ స్టార్ దర్శకులు కూడా ఫిదా కావడం విశేషం. లెజెండరీ దర్శకులు సైతం ప్రశంసలు కురిపించారు. రామ్ చరణ్ ని చూస్తుంటే సాక్షాత్తు అల్లూరి సీతారామరాజు చూసినట్లు అనిపిస్తుందని విమర్శకులు సైతం ఆయన పెర్ఫార్మన్స్ పై ప్రశంసలు కురిపించారు ఇక తుఫాన్ సినిమాతో ఏ బాలీవుడ్ ఇండస్ట్రీ అయితే తనకు యాక్టింగ్ రాదు అని విమర్శించిందో ఇప్పుడు అదే ఇండస్ట్రీ రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అంటూ కీర్తిస్తుంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ తారక్ తో కలిసి చేసిన నాటు నాటు సాంగ్ ఆస్కార్ అవార్డు గెలుచుకొని చరిత్ర సృష్టించింది. రామ్ చరణ్ సినీ కెరియర్ లో నట ప్రస్థానంలో ఆయన ఇమేజ్ ని అమాంతం పెరిగిపోయింది. నటుడిగానే కాకుండా ఇన్నేళ్ళ కెరియర్ ఒక వ్యక్తిగా కూడా రామ్ చరణ్ ఎంతో పరిణితి చెందడం విశేషం.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.