Pan India Movie: ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ మూవీ తర్వాత బుచ్చిబాబు సానా దర్శకత్వంలో మూవీ తెరకెక్కుతుంది. ఇక తరువాత కూడా నార్తన్ దర్శకత్వంలో ఒక అడ్వంచర్ యాక్షన్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని టాక్ వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే కోలీవుడ్ స్టార్ సూర్య ప్రస్తుతం శివ దర్శకత్వంలో ఫిక్షన్ లో వారియర్ తరహా కథాంశంలో నటిస్తున్నాడు. ఈ మూవీ పాన్ ఇండియా రేంజ్ లోనే తెరకెక్కుతుంది. దీంతో పాటు మరో మూవీ కూడా సెట్స్ పైన ఉంది. అయితే ఈ ఇద్దరి కలయికలో ఇప్పుడు ఒక సినిమా రాబోతుంది అనే టాక్ తెరపైకి వచ్చింది. రామ్ చరణ్, సూర్య కాంబినేషన్ లో భారీ మల్టీ స్టారర్ చిత్రాన్ని ప్లాన్ చేస్తున్న దర్శకుడు మరెవరో కాదు.
సీతారామం సినిమాతో ఒక్కసారిగా ఇండియన్ వైడ్ గా పాపులర్ అయిన హనురాఘవపూడి. ఈ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో ఇప్పుడు అదిరిపోయే ఫిక్షనల్ పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ మూవీని హను రాఘవపూడి సిద్ధం చేసుకున్నాడు. ఇక ఈ సినిమాని వైజయంతీ మూవీస్ బ్యానర్ నిర్మించడానికి రెడీ అయినట్లు తెలుస్తుంది. ఇక వేరొక నిర్మాణ సంస్థతో కలిసి ఈ భారీ ప్రాజెక్ట్స్ ని సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్నారనే టాక్ వినిపిస్తుంది.
ఇక ఈ సినిమాకి సంబంధించి త్వరలో అధికారిక ప్రకటన వెలువడే ఛాన్స్ ఉండనే మాట సౌత్ సర్కిల్ లో వినిపిస్తుంది. కోలీవుడ్ స్టార్ సూర్య, టాలీవుడ్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ అంటే రెండు భాషలలో కూడా ఈ మూవీకి మంచి హైప్ వస్తుంది. ఈ నేపధ్యంలో హనురాఘవపూడి ఈ మూవీని చాలా పకడ్బందీగా సిద్ధం చేయాలని, రెండు రాష్ట్రాల ఆడియన్స్ ని మెప్పించే విధంగా కథ, పాత్రల చిత్రణ ఉండాల్సిందే. మరి దానికోసం హను రాఘవపూడి ఎలాంటి ప్రయత్నం చేస్తాడనేది చూడాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.