Rakul Preet Singh : పవన్ సినిమాలో ఛాన్స్ నో అనేసిన రకుల్ ప్రీత్..?

Rakul Preet Singh : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ కోసం ప్రతీ హీరోయిన్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. కానీ, బక్కపలచని భామ రకుల్ ప్రీత్ సింగ్ మాత్రం నో అనేసిందట. ఇప్పుడు ఈ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాలలో బిజీగా ఉంటూనే, వరుసగా సినిమాలను చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే మేనల్లుడు సాయితేజ్ తో కలిసి మల్టీస్టారర్ మూవీలో నటిస్తున్నారు.

ఈ చిత్రాన్ని నటుడు దర్శకుడు సముద్రఖని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే చాలా వరకూ టాకీ పార్ట్ కంప్లీట్ అయింది. పవన్ కళ్యాణ్ కి సంబంధించిన సన్నివేశాల చిత్రీకరణ మొత్తం పూర్తయింది. కేవలం రెండు పాటలు చిత్రీకరించాల్సి ఉంది. వీటిలో ఒకటి ఐటమ్ సాంగ్ ఉందట. అందుకే, చిత్రబృందం ఈ సాంగ్ కోసం స్టార్ హీరోయిన్లనే పరిశీలిచింది. పవన్-సాయితేజ్ లతో కలసి స్టెప్పులేయాలసిన పాట కావడంతో వాళ్ల రేంజ్ కి ఏమాత్రం తగ్గకుండా హీరోయిన్ ఉండాలని ప్లాన్ చేస్తున్నారు.

rakul-preet-singh-rejected pawan kalyan movie

Rakul Preet Singh : తెలుగులో అవకాశాలేవీ లేకపోవడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్

దీనిలో భాగంగానే రకుల్ ప్రీత్ సింగ్ ని ఎంపిక చేసారట. ఇటీవల అమ్మడికి తెలుగులో అవకాశాలేవీ లేకపోవడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. కానీ, బాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉన్న కారణంగా ఇచ్చిన డేట్స్‌ను మళ్ళీ రీ షెడ్యూల్ చేయాలని కోరినట్టు తెలుస్తోంది. దీనికి మేకర్స్ ససేమిరా అన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఆల్రెడీ డేట్స్ లాకయ్యాయి కాబట్టి అదే డేట్స్ లో రకుల్ షూటింగ్ కి వస్తే ఓకే. లేదంటే ఊర్వశీ రౌటెలా ని దింపాలని ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.

త్వరలో దీనికి సంబంధించిన అఫీషియల్ కన్‌ఫర్మేషన్ రానున్నట్టు సమాచారం. ఒకవేళ రకుల్ గనక ఈ ఛాన్స్ మిస్ అయితే మళ్ళీ తెలుగులో అమ్మడికి పిలిచి ఛాన్స్ ఇచ్చేవారుండరని ఫిక్స్ అవొచ్చు. ప్రస్తుతం హిందీలో బిజీగా ఉన్నప్పటికీ తెలుగులోనే స్టార్ స్టేటస్ అందుకుంది. అలాంటిది ఇప్పుడు తెలుగు సినిమాకే నో చెప్పేస్తుందీ అంటే ఇక మన మేకర్స్ పట్టించుకోవడం కష్టమే.

 

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

60 minutes ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

3 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

2 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

2 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

3 days ago

This website uses cookies.