Technology: వ్యాపారాన్ని నడపడం అంత ఈజీ అయిన పని కాదు. భారత దేశంలో బై నౌ అండ్ పే లేటర్ విధానం రావడం వల్ల వ్యాపారాన్ని నిర్వహించడం ఆర్థిక స్థితిని సరిగ్గా ఉంచుకోవడం అనేది కఠినతరంగా మారింది. భారతీయ వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యలపై లోతైన అవగాహనతో, వ్యాపారులు తమ వ్యాపారాలను నిర్వహించడంలో సహాయపడే పరిష్కారాన్ని అందించించే దిశగా ప్రారంభమైన ఖాతా బుక్-డిజిటల్ ఇండియాస్ డిజిటల్ ఖాతా అనే భారతీయ స్టార్టప్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
2018 లో ఆశిష్ సోనోన్, ధనేష్ కుమార్, జైదీప్ పూనియా, రవీష్ నరేష్‌లు ఖాతా బుక్ స్టార్టప్‌ను స్థాపించారు. చిన్నమొత్తంలో వ్యాపారం చేసే యజమానులు వారి వ్యాపారం తో పాటు వ్యక్తిగత క్రెడిట్‌లను నిర్వహించడానికి ఈ కంపెనీ సహాయ పడుతుంది. కంపెనీ ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం 173 మిలియన్ డాలర్ల నిధులను పొందింది. ఈ డిజిటల్ లెడ్జర్ యాప్ ఆటోమేటిక్‌గా తన కస్టమర్‌లకు చెల్లింపు రిమైండర్‌లను పంపుతుంది. కస్టమర్‌లు వారి అన్ని లావాదేవీలు, చెల్లింపులను ట్రాక్ చేయడానికి వీలును కల్పిస్తుంది.
ఈ డిజిటల్ లెడ్జర్ యాప్ సురక్షితమైనదని యాప్ డెవలపర్స్ తెలిపారు. బహుళ వ్యాపారాలలో ఎంతమంది కస్టమర్‌లకైనా క్రెడిట్-డెబిట్ వివరాలను మీ ఫోన్‌లో సిద్ధంగా సులభంగా ఉంచుకోవడానికి ఖాతా బుక్ అనుమతిస్తుంది. మరీ ముఖ్యంగా ఈ యాప్ ద్వారా వ్యాపారులను ఎలాంటి ఒత్తిడి లేకుండా చేసుకోవడానికి వీలవుతుందని ఖాతా బుక్ వ్యవస్థాపకులు తెలిపారు. ప్రస్తుతం ఖాతా బుక్‌ను ఒక కోటికిపైగా వ్యాపారులు వినియోగిస్తున్నారు. ప్రతి నెల 5.5 మిలియన్ క్రియాశీల వినియోగదారులను ఈ యాప్ కలిగి ఉంది. ఇప్పటివరకు, ఈ డిజిటల్ లెడ్జర్ యాప్ 5 లక్షల కోట్లలకు పైగా లావాదేవీలను నమోదు చేసింది. 10,000 లకు పైగా నగరాలు ,పట్టణాలలో ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారు.
కిరానా షాప్ ఓనర్‌లు, చిన్న వ్యాపారులు, రీఛార్జ్ షాప్ ఓనర్‌లు మొదలైనవారు ఈ యాప్ యూజర్లుగా ఉన్నారు. ఖాతా బుక్ మల్టీ లాంగ్వేజస్‌లో అందుబాటులో ఉంది. హిందీ, పంజాబీ , కన్నడ, తమిళం, ఇంగ్లీష్ ఇలా 10కిపైగా భాషలలో ఈ యాప్ అందుబాటులో ఉంది. ఈ ఖాతాబుక్ రాబోయే నెలల్లో MSME ల కోసం ఇతర ఉత్పత్తులను ప్రారంభించాలని ఆలోచన చేస్తోంది. అంతే కాదు కంపెనీని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వంతో పాటు ఇతర ఫైనాన్స్ కంపెనీలతో కలిసి పని చేయాలని యోచిస్తోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.