Priyanka Chopra : ప్రియాంక చోప్రా ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. ప్రపంచ అందాల పోటీల్లో తన అందచందాలతో విజేతగా నిలిచింది ఈ బుట్టబొమ్మ. బాలీవుడ్ లోనూ స్టార్ హీరోయిన్ గా రాణించిన ఈ బ్యూటీ
హాలీవుడ్ లోనూ తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది. పాప్ సింగర్ నిక్ జోనస్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ బ్యూటీ ఒక పాపకు తల్లైంది. ప్రస్తుతం ఫారెన్ లో ఫ్యామిలీతో సెటిల్ అయ్యింది. అమ్మైనా కూడా అమ్మడి జోరు మాత్రం ఏం తగ్గలేదు. వరల్డ్ మోస్ట్ లవబుల్ కపుల్ గా పేరు దక్కించుకున్నారు నిక్, ప్రియాంకలు. వారి వారి ప్రొఫెషన్స్ లో బిజీగా ఉంటూనే ఈ జోడీ అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంటుంది. తాజాగా ఈ పెయిర్ కు సంబంధించిన పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. వారు క్యూట్ నెస్ ను చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
పారిస్‌లో జరిగిన వాలెంటినో ఫ్యాషన్ షో నుండి తాజా ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఈ బ్యూటీ ఈ ఫ్యాషన్ ఈవెంట్ కోసం ప్రకాశవంతమైన పింక్ కలర్ అవుట్ ఫిట్ ను వేసుకుంది. ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా హై హీల్స్ ను జతచేసి అదరగొట్టింది. ప్రకాశవంతమైన పింక్ కఫ్తాన్ స్టైల్ డ్రెస్ లో ఎంతో హాట్ గా కనిపించింది ప్రియాంక. ఈ కార్యక్రమానికి ప్రియాంక భర్త ఫేమస్ గాయకుడు నిక్ జోనాస్ హాజరయ్యాడు. ఈ బ్యూటీతో నల్లటి సూట్ ధరించి కెమెరాకు హాట్ పోజులు అందించాడు.
మొదటి రెండు ఫోటోల్లో గాజు గోడ పక్కన ఉన్న లాబీలో ప్రియాంక ఒంటరిగా పోజులిచ్చింది. మూడవ ఫోటోలో నిక్ తన ముఖాన్ని ఆమె భుజం పక్కన ఉంచి ఆమె నడుమును పట్టుకుని దిగాడు. ఇలా విభిన్న భంగిమల్లో హాట్ పోజులు ఇచ్చి ఈ లవ్లీ కపుల్ అందరి దృష్టిని ఆకర్షించింది. అభిమానులు వీరి కొత్త ఫోటోషూట్‌ను అమితంగా ఇష్టపడ్డారు. క్యా బాత్ హై బ్యూటిఫుల్ క్యూటీ సూపర్బ్ లవ్ యు అని అభిమానులు కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
ప్రియాంక త్వరలో సిటాడెల్‌లో కనిపించనుంది, ఇందులో రిచర్డ్ మాడెన్ సహనటుడుగా ఉన్నాడు. రస్సో బ్రదర్స్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. సిటాడెల్ ఇండియన్ వెర్షన్‌ను రాజ్ నిడిమోరు , కృష్ణ డి.కె రూపొందిస్తున్నారు. యాక్షన్‌తో కూడిన ఈ సిరీస్‌లో సమంత రూత్ ప్రభు , వరుణ్ ధావన్ నటించారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.