Priyanka Chopra : సినీ రంగం అంటేనే గ్లామర్ ప్రపంచం. ఇక్కడ దానికే ఫస్ట్ ప్రయారిటీ. యాక్షన్ సినిమా అయినా, సెంటిమెంట్ మూవీ అయినా సినిమా ఏదైనా కూడా గ్లామర్ డోస్ లేనిదే అది కంప్లీట్ కాదు. ఈ విషయంలో ఫిలిప్ మేకర్స్ అసలు తగ్గనే తగ్గర. తెరపైన అందంగా కనిపించే హీరోయిన్ లనే కోట్లు ఖర్చుపెట్టి మరి ఎన్నుకుంటారు. సౌత్ నుంచి నార్త్ వరకు ఎవరి హవా ఉంటే వారిని ఇండస్ట్రీలో దింపేందుకు ప్రయత్నిస్తారు. ఏమాత్రం ఫేడౌట్ అయ్యానా గ్లామర్ తగ్గినా వారిని ఇట్టే తీసి పక్కన పడేస్తారు.
ఇలాంటి సంఘటన నే ఒకప్పటి బాలీవుడ్ బ్యూటీ నేటి హాలీవుడ్ యువరాణి ప్రియాంక ఫేస్ చేసింది. తన అందానికి మరింత మెరుగులు దిద్దుకుందామని ఓ ప్లాస్టిక్ సర్జరీ చేసుకుంది ప్రియాంక అది కాస్త తన కొంప ముంచింది. ఆ ఒక్క సర్జరీతో బాలీవుడ్ లో తన కెరీర్ కి పుల్ స్టాప్ పడేటంత పనైపోయింది. విషయం ఏంటంటే ప్రియాంక ఇండస్ట్రీ వచ్చి తర్వాత తన ముక్కుకి పెదాలకు సర్జరీ చేయించుకుంది. పెదాలు ఓకే కానీ ముక్కు దగ్గరే కొంచెం తేడాతో కొట్టేసింది.
ముక్కుకు చేయించుకున్న సర్జరీ వికటించడంతో అప్పటికే సైన్ చేసిన సినిమాల నుండి భామను తప్పించరాట. ఒక సమయంలో ఒక సినిమాలో సైడ్ క్యారెక్టర్ రూల్ చేయాల్సి వచ్చిందట. ఈ విషయాన్ని స్వయంగా ప్రియాంక చెప్పింది. ఇటీవల ఓ షోకు హాజరైన ప్రియాంక తన జీవితంలో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది.ఆ సమయంలో డిప్రెషన్ లోకి వెళ్ళానని తీవ్రమైన మనో వేదనను అనుభవించానని ప్రియాంక తెలిపింది.
ఇది సీన్ జరిగి 20ఏళ్ల అవుతుంది. “అప్పట్లో సర్జరీ కి ముందు ఊపిరి తీసుకోవడానికి చాలా ఇబ్బంది పడేదాన్ని. జలుబు కూడా చాలాకాలం వరకు తగ్గలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్తే ముక్కులో పాలిప్స్ ఉన్నాయని తొలగించాలని చెప్పారు . అయితే అనుకోకుండా ముక్కు పైన ఉన్న చిన్న భాగాన్ని ఆపరేషన్ చేసి తొలగించారు. దీంతో నా ముఖం అంతా మారిపోయింది.అప్పటికే నేను కొన్ని సినిమాలు సైన్ చేశాను. కానీ నా ముఖంలో సర్జరీ తాలూకూ మార్పులు స్పష్టంగా తెలిసిపోయేవి. దీంతో నన్ను 3 సినిమాల నుంచి తప్పించారు నా కెరీర్ ముగుస్తుందని చాలా బాధపడ్డాను. అప్పుడు మా నాన్న నాకు అండగా నిలిచారు. ముక్కును కరెక్ట్ చేసుకునేందుకు కాస్మొటిక్ సర్జరీ చేయించుకోమని నన్ను ప్రోత్సహించారు. అలా మళ్లీ నాకు ధైర్యం వచ్చింది ” అని ప్రియాంక తెలిపింది.
ఆ ధైర్యమే ఇప్పుడు ప్రియాంకను గ్లోబల్ స్టార్ గా మార్చింది. హాలీవుడ్ సినిమాలు తీస్తూ ప్రపంచాన్ని శాసిస్తోంది ఈ బ్యూటీ. నచ్చిన ప్రియుడిని పెళ్లాడి ఒక పాపకు జన్మను ఇచ్చిన తర్వాత కూడా తన కెరీర్ కంటిన్యూ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా ప్రియాంక చోప్రా జలకన్య అవతారంలో తలుక్కుమంది. ఈ ప్రపంచ సుందరి….షేపులు చూపిస్తూ పిచ్చెక్కిస్తోంది.
Pawan Kalyan:హైదరాబాద్‌లో ఉస్తాద్ భగత్‌సింగ్ ప్రీరిలీజ్ ఈవెంట్..ఏ డేట్ లాకైందో తెలుసా? అంటూ ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి…
Ram Charan: మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా 'పెద్ది' నుంచి అప్‌డేట్స్ రావడం లేదని…
Mega 158: మెగాస్టార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మెగా 158 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతోంది. గతంలో చిరుకి వాల్తేరు వీరయ్య…
Puranapanda Srinivas: తిరుమల క్షేత్రమే తరలి వచ్చినట్లుగా వేల కొలది భక్తుల ఆనందోత్సాహాల మధ్య హైదరాబాద్ జూబిలీహిల్స్ శ్రీ వేంకటేశ్వరస్వామి…
Kalki 2898 AD Sequel:సైలెంట్‌గా కల్కి సీక్వెల్ షూట్..సెట్స్‌లో అమితాబ్, ప్రభాస్! అవును..ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్…
Puranapanda Srinivas: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ, కటాక్షాలూ…
This website uses cookies.