Prashanth Varma : కథ మీద పట్టు, తీసే స్టోరీ పై క్లారిటీ ఉండలే గాని ఎవరైనా సరే అద్భుతమైన చిత్రాలను తీయగలరని నిరూపించాడు టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ. ఇన్నాళ్లు చిన్న చిన్న సినిమాలతో ప్రేక్షకులను అలరించిన ప్రశాంత్ ఎవరూ ఊహించని విధంగా సూపర్ హీరో సినిమాను ఆత్యద్భుతంగా తీసి నార్త్, సౌత్ అన్న తేడా లేకుండా ప్రేక్షకుల మనసును గెలుచుకున్నాడు. సంక్రాంతి కానుకగా విడుదలైన హనుమాన్ మూవీ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలను సైతం పక్కకు నెట్టి భారీ వసూళ్లను రాబట్టింది మూవీ. ప్రపంచవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన హనుమాన్ మూవీ ఏకంగా 250 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.
ఇక హనుమాన్ విజయం గురించి పక్కకు పెడితే ఈ సినిమాతో ఫుల్ ఫేమస్ అయిపోయాడు యువ డైరెక్టర్ ప్రశాంత్. దీనితో ప్రశాంత్ వర్మ మీద రోజుకొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొన్నటికి మొన్న దర్శక ధీరుడు రాజమౌళి పైన కోపం వచ్చిందని చెప్పి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాడు ప్రశాంత్. ఇప్పుడు ఏకంగా టాలీవుడ్ స్టార్ హీరోల గురించి కామెంట్ చేశాడు. చాలా రోజుల వరకు రామ్ చరణ్, అల్లు అర్జున్ కోసం వెయిట్ చేసి తప్పు చేశాను అంటూ ప్రశాంత్ వర్మ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడాడట. ఇక ఈ వార్త కూడా నెట్ లో వైరల్ గా మారిపోయింది.మరి ఫ్యాన్స్ ఊరుకుంటారా చెప్పండి ప్రశాంత్ ని ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు.
అయితే తాజాగా ఈ విషయం పైన ప్రశాంత్ వర్మ స్పందించాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. “మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ లపై నేను కామెంట్ చేసినట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చాడు. అసలు నా ఇంటర్వ్యూలో వీరిద్దరి పేర్లు ఎక్కడా ప్రస్తావించలేదని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ ఇద్దరు స్టార్ హీరోలు అంటే నాకు చాలా ఇష్టం. కథ దొరికితే తప్పకుండా ఎప్పటికైనా వీరిద్దరితో నేను సినిమా చేస్తాను.దయచేసి ఇలాంటి తప్పుడు ప్రచారాలు చేయకండి ” అంటూ ప్రశాంత్ వర్మ కోరాడు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.