Categories: MoviesNews

Rajinikanth : నా కూతురు అలా అనలేదు..రజనీకాంత్ క్లారిటీ

Rajinikanth : గత కొంత కాలంగా సూపర్ స్టార్ రజనీకాంత్‌ కు సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. లాల్ సలామ్ ఆడియో లాంచ్‌ కార్యక్రమంలో రజనీకాంత్ పై వస్తున్న ట్రోన్స్ పై కూతురు ఐశ్వర్య  చేసిన కామెంట్స్ నెట్టింట్లో తీవ్ర దుమారం రేపాయి. తన తండ్రిని సంఘీ అంటూ విమర్శలు చేస్తున్నారని ఆమె భావోద్వేగమైంది. నా తండ్రి సంఘీ కాదని  అలా అయితే.. ఆయన ‘లాల్‌ సలామ్‌’ మూవీలో అసలు నటించేవారు కాదని తెలిపింది. ఈ మాటలు విన్న సూపర్ స్టార్  కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.

rajinikanth-gave-clarity-on-daughter-aishwarya-comments

రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య  దర్శకత్వంలో వస్తున్న మూవీ లాల్ సలాం. ఈ సినిమాలో గెస్ట్ రోల్ పోషిస్తున్నారు రజనీకాంత్. ఈ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉంటుందని ఐశ్వర్య ఇప్పటికే తెలిపింది. ఈ మూవీలో విష్ణు విశాల్‌, విక్రాంత్‌ లు  నటిస్తున్నారు. లాల్ సలాం మూవీకి ఏఆర్‌ రెహమాన్‌ మ్యూజిక్ అందిస్తున్నారు. దీంతో సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.  ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా లాల్ సలాం రిలీజ్ కాబోతోంది. ఈ మధ్యనే  ఆడియో లాంచ్ ఈవెంట్ చైన్నెలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఐశ్వర్య తన తండ్రిని ఉద్దేశించిన మాటలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో రజనీకాంత్ తన కూతురు మాటలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు.

ప్రస్తుతం రజనీకాంత్‌ జ్ఞానవేల్‌ డైరెక్షన్ లో వేట్టైయాన్‌ మేవీ చేస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ నిమిత్తం ఆయన ఆంధ్రప్రదేశ్ లోని కడప వెళ్లారు. అక్కడ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయిన రజనీకాంత్ మీడియాతో మాట్లాడారు. తన కూతురు ఐశ్వర్య మాట్లాడిన సంఘీ అంశం గురించి విలేఖరులు ప్రశ్నించగా  సంఘీ అంటే చెడ్డ పదం కాదని రజనీకాంత్‌ క్లారిటీ ఇచ్చారు.  ఐశ్వర్య ఉద్దేశం కూడా సరైనదేనని తాను ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని ఆయన తెలిపారు. తన తండ్రి ఒక ఆధ్యాత్మిక భావాలు కలిగిన వ్యక్తి అని.. ఎందుకు అలాంటి దృష్టితో చూస్తారని మాత్రమే ఐశ్వర్య అనిందని తెలిపారు. అంతే కాదు ఈ డిస్కషన్  లాల్‌ సలాం మూవీ ప్రమోషన్ కోసం మాత్రం కాదని తేల్చిచెప్పారు. లాల్‌ సలాం మూవీ చాలా బాగా వచ్చింది. ఫిబ్రవరి 9న విడుదలకు రెడీగా ఉంది అని అన్నారు.

Sri Aruna Sri

Recent Posts

Kollywood: ఓం రివ్యూ- ధనుష్, సాయిపల్లవి మూవీ మెప్పించిందా?

మూవీ: ఓం (OM: ఆపరేషన్ మోల్) నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శ్రీలీల, శివాజీ రాజా, నసీరుద్దీన్ షా,…

3 days ago

Tollywood: “ఆకాశంలో ఒక తార”: రివ్యూ & రేటింగ్‌

టైటిల్: ఆకాశంలో ఒక తార నటీనటులు: దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి, శ్రుతి హాసన్, మురళీ శర్మ, స్వాసిక, రుహానీ…

3 days ago

Tollywood: పవన్‌తో విడిపోయిన వెంటనే అన్నా కీలక నిర్ణయం..!

Tollywood: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం మరోసారి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ, సోషల్ మీడియా వేదికగానూ హాట్…

2 weeks ago

AP POLITICS: ఏపీ లోకల్ ఎలక్షన్స్.. వైసీపీకి ప్లస్సా? మైనసా?

AP POLITICS: గత సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాజయం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా కోలుకోలేదా? అంటే..…

2 weeks ago

TS POLITICS: రేవంత్ బర్త్‌డే: పట్టించుకోని కాంగ్రెస్ పెద్దలు

TS POLITICS: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఒక…

2 weeks ago

NATS: షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్

NATS: అమెరికాలోని షార్లెట్‌ లో నిర్వహించిన ‘షార్లెట్ తెలుగు సంబరాలు 2026’ వేడుకలు ఘనంగా జరిగాయి. చిన్నారులు, యువత, పెద్దలు…

1 month ago

This website uses cookies.