Prasanth Kishore: కేంద్రంలో బీజేపీ పార్టీని ఓడించడం విపక్షాల వలన కాదని, మళ్ళీ వారు దర్జాగా అధికారంలోకి వస్తారని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యానించారు. బీజేపీని ఓడించాలంటే విపక్షాలు అన్ని కేవలం వ్యక్తిగతంగా కలిస్తే సరిపోదని సైద్ధాంతికంగా కలవాల్సిన అవసరం ఉందని అన్నారు. ముఖ్యంగా బీజేపీని బలంగా ఎదుర్కోవాలంటే హిందుత్వ, జాతీయవాదం, సంక్షేమాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో ఒక్కో పార్టీ ఒక్కో సిద్ధాంతంగా పని చేస్తుందని అన్నారు. ఎవరికి వారుగా చూసుకున్నప్పుడు వారి భావజాలం కరెక్ట్ గానే ఉన్నా కూడా బీజేపీలాంటి బలమైన శక్తిని ఎదుర్కోవాలంటే మాత్రం ఒంటరిగా పోరాడటం సాధ్యం కాదని అన్నారు.
ముందుగా ప్రజలలోకి మన సిద్దాంతాలని బలంగా తీసుకెళ్ళి వారికి నమ్మకం కలిగించాలని అన్నారు. గాంధీవాది, అంబేద్కరైట్స్, సోషలిస్టులు, కమ్యూనిస్టులు లాంటి సిద్ధాంతం ఏదైనా సరే ఒంటరిగా ప్రజల నమ్మకాన్ని సాధించడం అంత ఈజీ కాదని చెప్పారు. తనది మహాత్మాగాంధీ భావజాలమని, దాని ద్వారానే పాదయాత్ర చేస్తూ బిహార్ లో కాంగ్రెస్ ని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు.
సిద్ధాంతాల ప్రకారం విపక్షాలు ఏకం కానంత వరకు బీజేపీని ఓడించే అవకాశమే లేదని అన్నారు. ఎన్ని సార్లు అయిన బీజేపీ అధికారంలోకి వస్తూనే ఉంటుంది అని తేల్చేశారు. అలాగే తాను కాంగ్రెస్ పార్టీకి మరల జీవం పోద్దామని ప్రయత్నం చేస్తే వాళ్ళు వచ్చే ఎన్నికలలో గెలవడంపై దృష్టి పెట్టారని, వారు తన సలహాలు స్వీకరించేందుకు సిద్ధంగా లేరని ప్రశాంత్ కిషోర్ చెప్పడం విశేషం. ఇప్పటికే ఒక్కొక్క రాష్ట్రంపై పెత్తనం సొంతం చేసుకుంటూ బీజేపీ దూసుకుపోతుంది. తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చే దిశగా అడుగులు వేస్తుంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.