Rashmika Mandanna : లండన్ వెళుతున్న రష్మిక..ఇప్పట్లో తిరిగి రానట్టేనా..?

Rashmika Mandanna : నేషనల్ క్రష్‌గా మారిన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న లండన్ ఫ్లైటెక్కిందట. ఈ బ్యూటీ జోరు కాస్త తగ్గినా చేతిలో ఉంది మాత్రం భారీ చిత్రాలే. పుష్ప తర్వాత పాన్ ఇండియన్ రేంజ్‌లో క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత తెలుగు కంటే ఎక్కువగా హిందీలో బిజీ అయింది. అలా అని తెలుగులో సినిమాలు ఒప్పుకోవడం లేదా..? అంటే అదేమీలేదు. సీతారామం లాంటి అద్భుతమైన కథ వస్తే గెస్ట్ రోల్ చేయడానికి కూడా రెడీ అంటోంది.

ప్రస్తుతం రష్మిక మందన్న చేతిలో అల్లు అర్జున్ – సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప 2 ఉంది. అలాగే, బాలీవుడ్‌లో సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ అనే కల్ట్ కంటెంట్ ఉన్న సినిమా తెరకెక్కుతోంది. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్. ఇన్ని రోజులు అటు యానిమల్ ఇటు పుష్ప 2 చిత్రీకరణలో పాల్గొంటూ ముంబై టు హైదరాబాద్ ట్రావెల్ చేసింది. అయితే, యానిమల్ చిత్రీకరణ ఇక్కడ కంప్లీట్ అయిందట.

rashmika-mandanna-going to london for animal shoot

Rashmika Mandanna : రేస్‌లో కాస్త వెనకబడిన రష్మిక..

నెక్స్ట్ షెడ్యూల్ కోసం ఏప్రిల్ నెలలో చిత్ర యూనిట్ లండన్ వెళ్ళడానికి ప్రణాళిక సిద్ధం చేస్తోంది. యూకే, స్కాట్లాండ్ ప్రాంతాలలో షూటింగ్ షెడ్యూల్స్ ప్లాన్ చేశారట. దాదాపు 25 రోజుల పాటు అక్కడ షూట్ చేయనున్నట్టు సమాచారం. ఈ షెడ్యూల్‌లో రష్మిక మందన్న కూడా జాయిన్ కాబోతోంది. హీరోతో కలిసి కొన్ని ఇంటిమేట్ సీన్స్ చేయనుందట. సందీప్ రెడ్డి వంగ సినిమా అంటే హీరోహీరోయిన్‌ల మధ్య ఘాటు రొమాన్స్ ఉంటుంది.

ఇందులో కూడా అలాంటి సన్నివేశాలు బాగానే ఉన్నాయట. ఇక ఇదే షెడ్యూల్‌లో బాబి డియోల్, అనీల్ కపూర్ కూడా జాయిన్ అవుతారని తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యేంతవరకూ మళ్ళీ రష్మిక మందన్న ఇండియాకి తిరిగి రాదని తెలుస్తోంది. ఆ తర్వాత పుష్ప 2లో జాయిన్ అవుతుందట. రేస్‌లో కాస్త వెనకబడిన రష్మిక మందన్నకి హిందీలో యానిమల్ తెలుగులో పుష్ప 2 సక్సెస్ చాలా అవసరం. లేదంటే కెరీర్‌కి ఇబ్బందులు తప్పవంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

1 week ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

1 week ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

4 weeks ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

4 weeks ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.