Categories: EntertainmentLatest

Prabhas : ప్రభాస్ ఫ్యాన్స్‎కు బంపరాఫర్‌..ఆ బైక్ గెలుచుకునే ఛాన్స్

Prabhas : యంగ్ రెబల్ స్టార్ డార్లింగ్ ప్రభాస్ నటించిన సలార్‌ మూవీ బాక్సీఫీస్ ను ఏ విధంగా దున్నేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లను రాబట్టింది. అప్పటి వరకు వరుస ఫ్లాపులతో అప్‎సెట్ అయిన ప్రభాస్ సలార్ తో మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు. సలార్ మూవీ ఏకంగా రూ.700 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ పార్ట్ సూపర్ హిట్ కావడంతో ఫ్యాన్స్ సెకెండ్ పార్ట్ రిలీజ్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. రెండో భాగం షూటింగ్ కూడా శరవేగంగా జరుపుతున్నారు. అతి త్వరలోనే విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. థియేటర్లలో భారీ విజయాన్ని అందుకున్న సలార్‌ ఓటీటీలోనూ దుమ్ముదులిపేసింది. లేటెస్టుగా బుల్లితెరపై కూడా సందడి చేసేందుకు రెడీ అయ్యింది. ఏప్రిల్‌ 21న స్టార్‌ మాలో సాయంత్రం 5.30 గంటలకు సినిమా టెలికాస్ట్‌ కానుంది. ఈ క్రమంలో మూవీ మేకర్స్ ప్రభాస్ ఫ్యాన్స్ కోసం ఓ బంపరాఫర్‌ను అనౌన్స్ చేశారు.

prabhas-lucky-chance-to-win-salaar-bike

సలార్‌ మూవీలో ప్రభాస్‌ డ్రైవ్ చేసిన బైక్‌ను సొంతం చేసుకునే ఛాన్స్ ను ఫ్యాన్స్ కు అందించింది హోంబలే ఫిల్మ్స్. అఫీషియల్ గా ఈ విషయమై ప్రకటించింది. ఒక ఒక్క ఎస్‌ఎమ్‌ఎస్‌ తో బైక్‌ను సొంతం చేసుకునే ఛాన్స్ ఇచ్చింది. బైక్‌ను ఎలా సొంతం చేసుకోవాలి అనే విషయాన్ని వివరిస్తూ ఓ ట్వీట్ కూడా పోస్ట్ చేసింది సంస్థ.

prabhas-lucky-chance-to-win-salaar-bike

స్టార్‌ మాలో ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు సినిమా టెలికాస్ట్ కానుంది. ఆ సమయంలో స్క్రీన్ కి ఒకవైపు బైకు కనిపిస్తూ ఉంటుంది. సినిమా పూర్తయ్యేలోపు ఆ బైక్‌ స్క్రీన్ మీద ఎన్నిసార్లు కనిపించిందో కరెక్ట్ గా చెబితే బైక్‌ను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. మూవీ టెలికాస్ట్ పూర్తి కాగానే వెంటనే ఎస్‌ఎమ్‌ఎస్‌ లైన్లు స్టార్ట్ అవుతాయి. ఆ వెంటనే 9222211199 నంబర్‌కు SALAAR అని టైప్‌ చేసి స్పేస్ ఇచ్చి బైక్‌ ఎన్నిసార్లు కనిపించిందో ఆ కౌంట్ నెంబర్‌ను ఎంటర్‌ చేసి పంపించాలి. అంతే అని వివరించింది. అంటే ప్రేక్షకులు ఎస్‌ఎమ్‌ఎస్‌ లను ఏప్రిల్ 21 రాత్రి 8 గంటల నుంచి సెండ్ చేయాల్సి ఉంటుంది. మీరే కనుక లక్కీ అయితే ప్రభాస్‌ బైక్‌ను సొంతం చేసుకోవచ్చు.

Sri Aruna Sri

Recent Posts

TTD: శ్రీవారి ఆలయం నుంచి కళ్యాణ శ్రీనివాసుడుకి రూ.33 లక్షల స్వర్ణాభరణాల సమర్పణ..

TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…

2 hours ago

Andhra Pradesh: రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది.. ఆ నలుగురు అవుట్!

Andhra Pradesh: దేశ రాజధానిలో పెద్దల సభ ఖాళీలను భర్తీ చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా (ఈసీ) కీలక…

12 hours ago

Health care: డయాబెటిక్ ఉన్న వాళ్ళు అరటిపండు తినొచ్చా?అది అపోహ మాత్రమేనా?

Health care:  ఇటీవల కాలంలో చిన్న పిల్లలు నుంచి పండు ముసలి వారి వరకు ఎదుర్కొంటున్న అనారోగ్య సమస్యలల్లో డయాబెటిక్ సమస్య…

18 hours ago

TTD: జూన్ 6 నుంచి కార్వేటి నగరం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు.. పోస్టర్లు రిలీజ్ చేసిన టీటీడీ

TTD: కలియుగ దైవమైన తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా ఉంటాయి. స్వామివారి బ్రహ్మోత్సవాలను ఎంతో అంగరంగ…

1 day ago

AP POLITICS: ద‌క్షిణాదికే న‌ష్టం.. డిలిమిటేషన్‌పై చంద్రబాబు పొలిటికల్ బాంబ్!

AP POLITICS: దేశ రాజకీయాల్లో ఇప్పుడు ‘డిలిమిటేషన్’ (నియోజకవర్గాల పునర్విభజన) అంశం ఒక హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా దక్షిణాది…

3 days ago

Andhra Pradesh: జగన్ షాకింగ్ డెసిషన్.. వైసీపీ నేత‌ల్లో గుబులు..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికల వేడి తగ్గిందో లేదో.. అప్పుడే స్థానిక సంస్థల ఎన్నికల రణం మొదలైపోయింది. ఈ…

3 days ago

This website uses cookies.