Preity Zinta : బాలీవుడ్ నటి ప్రీతీ జింటా గురించి అందరికీ తెలుసు. సౌత్ ఇండస్ట్రీలో ఆమె చేసింది రెండు మూడు సినిమాలే అయినా తన అందం, నటనతో ప్రేక్షకులను అలరించింది. ఆమె తెలుగులో చేసిన ప్రేమంటే ఇదేరా, రాజకుమారుడు సినిమాలు స్టార్ హీరో సినిమాలు కావడం అవి బాక్సాఫీస్ దగ్గర హిట్ కావడంతో టాలీవుడ్ లో అమ్మడు కంటిన్యూ చేస్తుందని అనుకున్నారు. కానీ భామ ఆ తర్వాత తెలుగులో కానీ , తమిళంలో కానీ నటించలేదు. బాలీవుడ్ లో సెటిల్ అయ్యింది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ప్రీతీ తన టాలెంట్ తోనే ఇండస్ట్రీలో క్రేజ్ సంపాదించుకుంది. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. అయితే తాజాగా ఈ భామ ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. హీరో , హీరోయిన్ కావాలనుకునే వారికోసం హితబోధన చేసింది. ఆ కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
పెళ్ళి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది ప్రీతీ జింటా. అయితే కొన్నేళ్లుగా ఈ భామ ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ జట్టుకు కో ఓనర్ గా ఉంటోంది. లేటెస్టుగా ఓ ఇంటర్వ్యూలో ప్రీతీ బాలీవుడ్ గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఎలాంటి బ్యాక్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చే అమ్మాయిలకు.. అబ్బాయిలకు బాలీవుడ్ అంత సేఫ్ కాదని చెప్పింది. “బాలీవుడ్ రాణించాలంటే అంత సులభం కాదు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చే వారికి ఇది సేఫ్ ప్లేస్ కాదు. ఫిల్మ్ బ్యాగ్రౌండ్ ఉన్నవారే ఇక్కడ ఉండగలరు. సెలబ్రిటీలతో పరిచయాలు తప్పనిసరిగా ఉండాలి. అలాంటివారే నిలబడగలరు. ఎందుకంటే ఇక్కడ ఏ క్యారెక్టర్ ఇచ్చినా చేయడానికి రెడీగా ఉండే వారు చాలా మంది ఉంటారు. వాళ్లందరినీ క్రాస్ చేసి ముందుకు రావాలంటే మాత్రం కంపల్సరీ. లేదంటే రోడ్డు మధ్యలో నిల్చొని ఏ కారు ఢీకొంటుందోనని నిత్యం భయం భయంగా ఉంటుంది”అని షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రీతీ జింటా.
బాలీవుడ్ లో నటిగా మంచి ఫాంలో ఉన్నప్పుడే ప్రీతీ జింటా 2016లో అమెరికాకు చెందిన జీన్ ను లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆమె చివరిగా భయ్యాజీ మూవీ చేసింది. వివాహం తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. అయితే ఐపీఎల్ తో మళ్లీ అందరికీ కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ జట్టుకు సహ యజమానిగా వ్యవహరిస్తోంది ప్రీతి. ఇక ప్రీతి సరోగసి ద్వార కవల పిల్లలకు జన్మనిచ్చింది. ప్రస్తుతం బాలీవుడ్ లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది.
Night Sleep: మనం ఎంతో ఆరోగ్యంగా ఉండాలి అంటే తీసుకునే ఆహారం మాత్రమే కాకుండా మన శరీరానికి సరిపడా నిద్ర…
Ashada Amavasya 2026: మన హిందూ ధర్మ శాస్త్రంలో ఆచార్య వ్యవహారాలకు ఎంతో ప్రాధాన్యతను కల్పిస్తారు. ఈ నేపథ్యంలోనే ప్రతినెల వచ్చే…
Lemon Water: ఇటీవల కాలంలో చాలా మళ్లీ ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ వహిస్తున్నారు ఈ నేపథ్యంలోని ప్రతిరోజు ఉదయం…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరుమలకు చేరుకుంటున్న సంగతి తెలిసిందే. ప్రతిరోజు లక్షలాదిమంది భక్తుల స్వామి…
Coconut Water: కొబ్బరి నీళ్లలో సహజసిద్ధమైన ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. కొబ్బరి నీళ్లలో పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం…
Pushpayagam Seva Tickets: తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఏడాది ఎంతో ఘనంగా పుష్పయాగం నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలోనే ఈ…
This website uses cookies.