Prabhas : బట్టతలతో కనిపించబోతున్న ప్రభాస్..ఏ సినిమాలో అంటే..?

Prabhas : బట్టతలతో కనిపించబోతున్న ప్రభాస్. అవునా..? అంటే ఇప్పుడు ఓ వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మన టాలీవుడ్ స్టార్స్ లో కొందరికి బట్టతల ఉందని ఎప్పుడూ ప్రచారం జరుగుతూనే ఉంటుంది. వారిలో ముఖ్యంగా పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబుల గురించే ఎక్కువ చర్చ జరుగుతూనే ఉంది. ఎందుకంటే వీరిద్దరే ఎక్కువగా మేకోవర్ విషయంలో కొత్త ప్రయత్నాలు చేసేది. మరీ ముఖ్యంగా హెయిర్ స్టైల్ విషయంలో రక రకాలుగా కనిపిస్తుంటారు. బాహుబలి రెండు భాగాలలో ఓ విధంగా, సాహో సినిమాలో ఓ విధంగా, రాధే శ్యామ్, సలార్, ప్రాజెక్ట్ K చిత్రాలలో మరోలా కనిపిస్తున్నారు ప్రభాస్.

అయితే, ప్రభాస్ పెదనాన్న రెబల్ స్టార్ కృష్ణం రాజుకి బట్టతల ఉందని తెలిసిందే. అదే వారసత్వంగా ప్రభాస్ కి బట్టతల ఉందని అందరూ అనుకుంటున్నారు. మోహన్ బాబు, సూపర్ స్టార్ కృష్ణ లాంటి వారికి ఉన్న బట్టతల కారణంగా విగ్గులు ధరించి అద్భుతంగా సిల్వర్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు. రాంగోపాల్ వర్మ తీసిన రౌడీ సినిమాలో మోహన్ బాబు నేచురల్‌గా కనిపించారు. అందులో ఆయన బట్టతలతో కనిపించడం బావుంది. కృష్ణ గారు కూడా బయటకి ఎక్కువగా విగ్గుతో రారు. సహజంగానే కనిపిస్తుంటారు. అక్కినేని నాగేశ్వరరావు, సీనియర్ ఎన్.టి.ఆర్ లాంటి వారు సినిమాలలో తప్ప, బయట విగ్గులతో కనిపించింది చాలా తక్కువ.

prabhas-look-with-bald-head

కానీ, ఇప్పటి జనరేషన్ హీరోలు మాత్రం విగ్గులేకుండా బయటకి రావడం లేదు. ముఖ్యంగా ప్రభాస్ కి బట్టతలనే మాట తరుచూ వినిపిస్తుంది. ఇటీవల ఆయన అలా బట్టతలతో ఉన్న ఫొటోలు కొన్ని సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇది చూసిన నెటిజన్స్ కొందరు వాటిని సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. గాగూల్స్ పెట్టుకొని బట్టతలతో ఉన్న ప్రభాస్ లుక్ బాగానే ఉంది. కానీ, ఈ పిక్స్ ప్రభాస్ అభిమానులకి ఎంతమాత్రం నచ్చడం లేదు. తమ అభిమాన హీరోను అలా చూడటానికి అస్సలు ఇష్టపడటం లేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఓ వార్త మాత్రం నెట్టింట బాగా చక్కర్లు కొడుతూ వైరల్ అవుతోంది. అదేమిటంటే, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ అనే భారీ యాక్షన్ చిత్రంలో బట్టతలతో కనిపించి షాకివ్వబోతున్నారట. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ప్రభాస్ లుక్ రిలీజై అందరినీ ఆకట్టుకుంది. సలార్ సెట్స్ మీదకి వచ్చినప్పటి నుంచి ఇందులో ఆయన డ్యూయల్ రోల్ చేస్తున్నారని వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇందులో ఎంతవరకూ నిజముందీ అనే విషయం మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు. దాంతో నిజంగానే ప్రభాస్ సలార్ సినిమాలో బట్టతలతో ఉన్న గెటప్‌లో కాసేపు కనిపించనున్నారని, ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అని టాక్ నడుస్తోంది. కాగా, ఈ సినిమాలో ప్రభాస్ కి జంటగా శృతి హాసన్ కనిపించబోతుంది. హోంబలే సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

15 hours ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

16 hours ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

2 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

3 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

3 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

4 days ago

This website uses cookies.