Prabhas: బాహుబలి సిరీస్ తర్వాత యంగ్ రెబల్ స్టార్ పాన్ ఇండియన్ స్టార్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత నుంచి మేకర్స్ ప్రభాస్ తో సినిమా అంటే కనీసం RS 200 కోట్ల బడ్జెట్ ని ఫిక్స్ అవుతున్నారు. అయితే, బాహుబలి ప్రభావం వల్ల మిగతా సినిమాలేవీ ఆ రేంజ్ లో సక్సెస్ సాధించలేకపోయాయి. దానికి కారణం ప్రభాస్ మీద అంచనాలు భారీగా పెరగడమే.
ఆ అంచనాలను మేకర్స్ అందుకోవడంలో ఫేయిల్ అవుతున్నారు. ‘సాహో’, ‘రాధే శ్యామ్’, ‘సలార్’ వచ్చాయి. వీటిలో తాజాగా వచ్చిన ‘సలార్’ సినిమా మేజిక్ ఫిగర్స్ అందుకునేలా ఉంది. కానీ, నార్త్ లో ఈ సినిమా ఆశించిన వసూళ్ళు రాబట్టలేదు. చెప్పాలంటే ‘సలార్’ తో పోల్చుకుంటే ‘సాహో’ ఈ విషయంలో చాలా బెటర్ అంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ‘సాహో’ సినిమా మీద భారీ అంచనాలు ఉండగా ఆ అంచనాలను బాలీవుడ్ లో మాత్రమే ‘సాహో’ అందుకుంది.
దీనికి కారణం మేకర్స్ అక్కడ ‘సాహో’ మూవీని భారీగా ప్రమోట్ చేయడమే. ఈ విషయంలో ‘సలార్’ కి గట్టి దెబ్బ పడింది. దీనికి కారణం ప్రశాంత్ నీల్ ఓవర్ కాన్‌ఫిడెన్స్ తో ‘సలార్’ ని హిందీ బెల్ట్ లో ప్రమోషన్స్ నిర్వహించకపోవడమే. కేవలం ‘సలార్’ మూవీ అవుట్ పుట్ చూసుకొని ప్రభాస్ కటౌట్ అదిరిపోయిందని ఇక ‘సలార్’ కి అంతగా ప్రమోషన్స్ అవసరం లేదనుకున్నాడు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకి నార్త్ తో పాటు సౌత్ భాషలలో ఏ రేంజ్ లో ప్రమోషన్స్ నిర్వహించారో అందరికీ తెలిసిందే.
ఆ సినిమాతో పోల్చుకుంటే ‘సలార్’ చిత్రానికి 10 శాతం ప్రమోషన్స్ నిర్వహించలేదు. అయినా గట్టిగానే కొట్టింది. ‘ఆర్ఆర్ఆర్’ రేంజ్ లో గనక సలార్ ప్రమోషన్స్ చేసి ఉంటే ‘సలార్’ ఫిగర్స్ గతంలో ఉన్న రికార్డ్స్ ని చెరిపేసి ఉండేది. కానీ, ఈ విషయం అర్థం కాని కొందరు ప్రభాస్ కి బ్యాక్ టు బ్యాక్ రెండు ఫ్లాప్స్ వచ్చిన కారణంగానే బాలీవుడ్ లో క్రేజ్ తగ్గిందని చెప్పుకుంటున్నారు. కానీ, అది నిజం కాదు.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.