Prabhas: బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా స్టార్ గా మారిపోయిన యంగ్ రెబల్ స్టార్ ప్రస్తుతం చేతిలో ఏకంగా ఐదు భారీ బడ్జెట్ సినిమాలను పెట్టుకున్నాడు. ఇందులో ఆదిపురుష్ మూవీ షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. సలార్ మూవీ షూటింగ్ జరుగుతోంది. మారుతి దర్శకత్వంలో చేస్తున్న రాజా డీలక్స్ షూటింగ్ దశలో ఉంది. నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేస్తున్న ప్రాజెక్ట్ కె సినిమా కూడా షూటింగ్ స్టేజ్ లో ఉంది. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో చేయబోయే సినిమా వచ్చే ఏడాది స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సిద్దార్ద్ ఆనంద్ దర్శకత్వంలో కూడా సినిమా స్టార్ట్ అయ్యే ఛాన్స్ లు ఉన్నాయి.
ఈ సినిమా కూడా వచ్చే ఏడాది సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓ విధంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రభాస్ మీద దేశంలోనే హైయెస్ట్ బిజినెస్ జరుగుతోంది. డార్లింగ్ ప్రభాస్ సినిమాల బడ్జెట్ పరంగా చూసుకున్న కూడా సుమారు 2000 కోట్ల వరకు ఉంటాయి అని అంచనా. ఇండియా నుంచి ఇప్పటి వరకు హాలీవుడ్ సినిమా రాలేదని చెప్పాలి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా ప్రభాస్ నుంచి ఇండియన్ హాలీవుడ్ సినిమాలు పరిచయం కాబోతున్నాయి. ఓం రావత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఆదిపురుష్ సినిమాని ఇంగ్లీష్ లో కూడా రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయికి రీచ్ కావాలంటే ఖచ్చితంగా హాలీవుడ్‌లో రిలీజ్ చేయాల్సిందే.
అప్పుడే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా అందరికీ చేరువ అవుతుంది. ఇదే లక్ష్యంతో ఇప్పుడు దర్శకుడు ఓం రావత్ ఆదిపురుష్ ని హాలీవుడ్ లో రిలీజ్ చేయాలని భావిస్తోంది. దానికి సంబంధించి డబ్బింగ్ వెర్షన్ కూడా స్టార్ట్ చేసినట్లుగా బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ సినిమాని కూడా హాలీవుడ్ లో రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. అలాగే ప్రాజెక్ట్ కె సినిమాని కూడా హాలీవుడ్ తో పాటు పలు అంతర్జాతీయ భాషలలో రిలీజ చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ లెవల్లో వర్కవుట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఇండియన్ సినిమా స్టాండర్డ్ అమాంతం పెరిగిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదని చెప్పాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.