Poorna : నటి పూర్ణ గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్ అవసరం లేదు. మలయాళం బ్యూటీ అయినప్పటికీ తెలుగు స్పష్టంగా మాట్లాడుతూ ఇండస్ట్రీలో తన నటనతో మంచి గుర్తింపును సంపాదించుకుంది. నిజానికి ఈ పూర్ణ ఒక మంచి డాన్సర్. ఆ డాన్సింగ్ టాలెంట్ తోనే సినీ ఇండస్ట్రీలో ఛాన్సులను కొల్లగొట్టింది. ఇండస్ట్రీలో చక్కటి హావభావాలు పలికించే హీరోయిన్లలో పూర్ణ ఒకరు. చీరకట్టుతో తెలుగువారి హృదయాలను దోచేసింది. ఈమధ్యనే పూర్ణ పెళ్లి చేసుకొని ఓ బాబుని కూడా కనింది. ఓవైపు హారర్, థ్రిల్లర్, లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటు ఎన్నో రియాల్టీ షోల్లో కెరీర్లో ముందుకెళ్తోంది. ఈ మధ్యనే గుంటూరు కారం సినిమాలో కూర్చుని మడత పెడితే సాంగ్ లో డ్యాన్స్ పెర్ఫార్మ్ చేసి అదరగొట్టింది పూర్ణ. ఇక లేటెస్ట్ గా పూర్ణ నటించిన తమిళ మూవీ ‘డెవిల్’ ఫిబ్రవరి 2న విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ప్రమోషన్ లో భాగంగా నిర్వహించిన మీడియా సమావేశంలో పూర్ణ స్టేజి పైనే ఒక్కసారిగా ఏడ్చేసింది.మ్యూజిక్ డైరెక్టర్ మిష్కిన్ మాటలకు ఆమె భావోద్వేగానికి గురైంది.
డైరెక్టర్ ఆదిత్య దర్శకత్వంలో త్వరలో రిలీజ్ అవుతున్న మూవీ ‘డెవిల్’. పూర్ణ, విదార్థ్, అరుణ్, మిష్కిన్ ఈ మూవీలో లీడింగ్ క్యారెక్టర్స్ పోషించారు. తాజా గా డెవిల్ మూవీ మేకర్స్ చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో మీడియా సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ మిష్కిన్ మాట్లాడుతూ” ఈ మూవీలో పూర్ణ చాలా అద్భుతంగా నటించింది. అయితే కొంతమంది కావాలని మా ఇద్దరి మధ్య ఏదో ఉందని రూమర్స్ క్రియేట్ చేశారు. నిజానికి పూర్ణ నాకు అమ్మలాంటిది. వచ్చే జన్మలో ఆమె కడుపులో పుడతాను” అని ఎమోషనల్ స్పీచ్ ఇచ్చాడు మిష్కిన్. ఈ మాటలు విన్న పూర్ణ ఒక్కసారిగా స్టేజ్ పైన ఏడ్చేసింది.
ఇక నటి పూర్ణ మాట్లాడుతూ..డెవిల్ మూవీ కాదని ఒక ఎమోషన్ అని ఇది నా లైఫ్ కి రిలేట్ అయిన ఒక ఎమోషన్ అని చెప్పింది. డైరెక్టర్ ఆదిత్య మాట్లాడుతూ.. ” సినిమా అంటే నాకు ఇష్టం. అందులో ఉండాల్సిన నిజాయితీని గురువు మిష్కిన్ నుంచే నేర్చుకున్నాను. చెప్పారు. కాగా.. ఈ సినిమాకి మిష్కిన్ మ్యూజిక్ అందించాడు. ప్రొడక్షన్ పనులను పూర్తిచేసుకున్న డెవిల్ ఫిబ్రవరి 2న థియేటర్లలో విడుదల కాబోతోంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.