Poonam Kaur : సడన్‌గా మానవత్వం గుర్తుకు వచ్చిందా?..పూనమ్ కౌర్ టార్గెట్ ఆయనేనా?

Poonam Kaur : కోలివుడ్ యాక్టర్ మన్సూర్ అలీ ఖాన్ నటి త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ప్రస్తుతం మన్సూర్ కామెంట్స్ ఇండస్ట్రీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నాయి. మన్సూర్ తీరును తప్పుపడుతూ ఇప్పటివరకు ఎంతోమంది సినీ సెలబ్రిటీలు త్రిషకు సపోర్టుగా నిలుస్తున్నారు. తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని త్రిషకు సారీ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి, సీనియర్ నటి కుష్బూ, హీరో నితిన్ ఈ వివాదం పై స్పందించారు.అయితే మెగాస్టార్ ట్వీట్ చేసిన కొన్ని నిమిషాలకే పూనమ్ కౌర్ ఓ ట్వీట్ చేసింది. దీంతో ఇప్పుడు ఈ ట్వీట్ నెట్ లో వైరల్ అవుతుంది.

poonam-kaur-targets-megastar-chiranjeevi-on-mansoor-ali-khan-issue

‘లియో’లో మూవీ లో తనకు , త్రిషకు మధ్య రేప్ సీన్ ఉంటుందని ఆశిస్తే… అలాంటి సీన్ లెకపివాడంతో అప్ సెట్ అయినట్లు నటుడు మన్సూన్ అలీ ఖాన్ తీవ్ర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ కామెంట్స్ వివాదాస్పదమయ్యాయి. తెలుగు, తమిళం అని వ్యత్యాసాలు లేకుండా అందరు త్రిషకు సపోర్టుగా నిలిచారు. మెగాస్టార్ కూడా త్రిషకు అండగా ఉంటానని చెప్పారు. ఇండస్ట్రీలోని ఏ మహిళపై అయినా ఇలాంటి వ్యాఖ్యలు చేసిన తాను ఖండిస్తానని చెప్పారు. అయితే ఆయన కామెంట్ చేసిన కొన్ని నిమిషాలకే పూనమ్ కౌర్ కామెంట్ చేసింది. అయితే ఈ కామెంట్స్ అన్నీ కూడా మెగాస్టార్ ని టార్గెట్ చేసే చేసిందని ఫ్యాన్స్ అంటున్నారు.

poonam-kaur-targets-megastar-chiranjeevi-on-mansoor-ali-khan-issue

“సడన్‌గా మానవత్వం గుర్తుకు వచ్చిందా?. చాలా ఇంపార్టెంట్ విషయాల్లో తమ గొంతు వినిపించని చాలా మందికి ఇవాళ ఉన్నట్లుండి మానవత్వం గుర్తుకు వచ్చింది . తమ ప్రెస్టీజ్ ను పెంచుకోవడానికో లేదా స్టేటస్ కోసం ఇలా స్త్రీలకు సపోర్ట్ గా ఉండకూడదు “అని పూనమ్ తెలిపింది. పూనమ్ కౌర్ ఈ ట్వీట్ కింద చిరును ట్యాగ్ చేసి ఓ నెటిజన్ రిప్లై ఇచ్చాడు. పూనమ్ ట్వీట్ పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. తోటి హీరోయిన్ గా , మరో మహిళకు అన్యాయం జరిగినప్పుడు ఆమెకు అనుకూలంగా స్పందిస్తే అభినందించడం పోయి… ఇలా పరోక్షంగా విమర్శలు చేయడం మంచిది కాదని అంటున్నారు. ఇలా ఓ ఫ్యామిలీ హీరోలను టార్గెట్ చేసి ప్రతిసారీ వ్యతిరేకత వ్యక్తం చేయడం ఆమె అలవాటుగా మారిందని చర్చించుకుంటున్నారు.

poonam-kaur-targets-megastar-chiranjeevi-on-mansoor-ali-khan-issue
Sri Aruna Sri

Recent Posts

Breast Cancer: మహిళల్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్లు.. తెలుసుకోవలసిన విషయాలు ఇవే!

Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…

3 minutes ago

Politics: తెలంగాణపై మోదీ కన్ను.. రూటు మార్చిన రేవంత్‌..!

Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…

54 minutes ago

Politics: ఇక నంబర్ 1 ఆయనే.. మోదీ అరుదైన రికార్డ్‌..!

Politics: భారత రాజకీయ చ‌రిత్ర‌లో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…

2 hours ago

Parama Ekadashi : నేడే పరమ ఏకాదశి.. మూడేళ్లకు ఒకసారి వచ్చే విశిష్టమైన రోజు..ఇలా పూజ చేస్తే చాలు ..

Parama Ekadashi : ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తాము అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ కొన్ని…

3 hours ago

Beauty Tips: ఎండకు చర్మం నల్లబడిందా… అరటి పండు మాస్క్ తో ట్యాన్ కు చెక్ పెట్టండి?

Beauty Tips: వేసవికాలంలో బయటకు వెళ్తే ఒక్క సారిగా చర్మం మొత్తం నల్లబడిపోతుంది. ఇలా చర్మం మొత్తం ట్యాన్ కావడంతో…

19 hours ago

YSRCP PARTY: జగన్‌కు బిగ్ షాక్.. ఆ నియోజకవర్గాల్లో వైసీపీ ఖాళీ!

YSRCP PARTY: గత ఎన్నికల ఓటమి గాయం నుంచి కోలుకోకముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాల్లో ఊహించని షాకులు తగులుతున్నాయి.…

24 hours ago

This website uses cookies.