Ponguleti Srinivasa Reddy: బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గత కొద్దిరోజులుగా ఖమ్మం జిల్లాలో తమ కార్యకర్తలతో రెగ్యులర్ గా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ ఉన్నారు. గత కొంతకాలం నుంచి బీఆర్ఎస్ పార్టీకి ఆయన దూరంగా ఉన్నారు. పార్టీలో సముచిత స్థానం కల్పించకపోవడంతో పాటు తన వ్యతిరేక వర్గాన్ని ప్రోత్సహిస్తూ ఉండడంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కొంతకాలం నిశ్శబ్దంగా ఉన్నారు. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఖమ్మం జిల్లాలో వరుసగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ తన కేడర్ ని మళ్లీ ఉత్సాహపరిచే ప్రయత్నం చేస్తున్నారు ఇదిలా ఉంటే ఇప్పటికే తాను ఏ పార్టీలో ఉన్నా కూడా తన అనుచరులు అందరు కూడా తనతో పాటు ఎమ్మెల్యేలుగా పోటీ చేస్తారని సంచలన కామెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే బీజేపీ పార్టీలోకి పొంగులేటి వెళ్తారని ప్రచారం కూడా నడిచింది.
అయితే బీజేపీ అధిష్టానానికి పొంగులేటి తన డిమాండ్స్ చెప్పడంతో వాటికి వారు ఒప్పుకోలేదు అని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం వైయస్ షర్మిల పెట్టిన వైయస్సార్టీపీ పార్టీలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే వైఎస్ షర్మిలతో గతంలో ఒకసారి పొంగులేటి భేటీ అయ్యారు. కొద్దిరోజుల క్రితం వైయస్సార్టీపీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మతో భేటీ అయ్యారు ఈ నేపథ్యంలోనే ఆయన షర్మిల పార్టీలో చేరడం ఖాయం అనే మాట తెలంగాణ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. వైయస్ షర్మిల పొంగులేటి డిమాండ్స్ అంగీకరించడంతో ఆ పార్టీలోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.
ఇదిలా ఉంటే తాజాగా పొంగులేటి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన కొంతమంది నాయకులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆ నాయకులందరినీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. దీంతో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కెసిఆర్ పై ఘాటుగా స్పందించారు. దమ్ముంటే తనని సస్పెండ్ చేయాలని సవాల్ విసిరారు. నన్ను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టిన ఒక్కడినే అనే అనుకోవడం మీ అవివేకం అంటూ హెచ్చరించారు. అభిమానుల నిర్ణయం మేరకు త్వరలో తాను ఏ పార్టీలో చేరేది స్పష్టం చేస్తానని తెలియజేశారు.
తనకి పార్టీ సభ్యత్వం కూడా లేదని ప్రచారం చేస్తున్నారని, అలా అయితే తన ఫోటోలు పార్టీ కార్యక్రమాలలో ఎందుకు ఉపయోగించారంటూ ప్రశ్నించారు. కొందరు అధికారులు ప్రలోభాలకు, ఒత్తిళ్లకు లొంగి మా కార్యకర్తలు ఇబ్బంది పడితే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఖమ్మం జిల్లాలో నాకు దమ్ము ధైర్యం ఉంది కాబట్టి నియోజకవర్గాల ప్రకటిస్తున్నానని తెలిపారు. మరి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సవాల్కి బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా స్పందిస్తుంది అనేది చూడాలి.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.