Politics: మోదీకి 7 రోజులే టైమ్.. కొత్త పార్టీ అల్టిమేటం!

Politics: గడిచిన 12 ఏళ్లుగా దేశ రాజకీయాల్లో తిరుగులేని శక్తిగా దూసుకుపోతోంది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం. గతంలో విపక్షాలు అవిశ్వాస తీర్మానం పెట్టినా నెగ్గుకుంటూ, వరుసగా మూడుసార్లు అధికారాన్ని చేజిక్కించుకున్న మోదీ స‌ర్కారుకు ఇప్పటివరకు ఎవరూ గట్టిగా అల్టిమేటం జారీ చేసిన దాఖలాలు లేవు. ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ సైతం చేయని సాహసాన్ని.. ఇప్పుడు సరికొత్తగా ఆవిర్భవించిన ఒక రాజకీయ పార్టీ చేసి చూపించింది. మోదీ ప్రభుత్వానికి ఏకంగా 7 రోజుల గడువు విధిస్తూ సంచలన డిమాండ్ తెరపైకి తెచ్చింది.

‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కే శనివారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వేదికగా కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు సాగిన ఈ నిరసన ప్రదర్శనలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ ఆయనే స్వచ్ఛందంగా రాజీనామా చేయకపోతే, ప్రధాని మోదీయే చొరవ తీసుకుని ఆయన్ను బర్తరఫ్ చేయాలని పట్టుబట్టారు.

politics-modi-has-only-7-days-new-partys-ultimatum

Politics: 12 ఏళ్ల మోదీ పాలనలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పార్టీ

ఈ సందర్భంగా పార్టీ అధికార ప్రతినిధి సౌరవ్ దాస్ మీడియాతో మాట్లాడుతూ.. ఇప్పటివరకు దేశం చూసింది కేవలం ట్రైలర్ మాత్రమేనని, కేంద్రం గనుక దిగిరాకపోతే అసలు సినిమా ముందుందని హెచ్చరించారు. దేశంలో ఇటీవల కాలంగా విద్యావ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను ఈ కొత్త పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం బలవంతంగా త్రిభాషా సూత్రాన్ని రుద్దాలని చూస్తోందని ఆరోపించింది. వీటన్నిటికంటే మిన్నగా.. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టిన ‘నీట్’ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్రం వైఫల్యాన్ని వారు తీవ్రంగా తప్పుపట్టారు. ఇంత పెద్ద కుంభకోణం జరిగినా విద్యాశాఖ మంత్రిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడాన్ని నిరసిస్తూ.. రాబోయే ఏడు రోజుల్లో కేంద్రం తుది నిర్ణయం తీసుకోకపోతే దేశవ్యాప్త కార్యాచరణకు దిగుతామని సిజెపి హెచ్చరించింది.

మరోవైపు ఈ కొత్త పార్టీ డిమాండ్లు, అల్టిమేటంపై అధికార బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. అసలు ఈ పార్టీ ఉనికిని, నిరసనలను తాము అస్సలు పరిగణనలోకి తీసుకోవడం లేదని కొందరు బీజేపీ ఎంపీలు కొట్టిపారేశారు. “ఇంట్లో బొద్దింకలు కనిపిస్తే ఎవరైనా భయపడతారా? వాటిని తరిమికొడతారు. అలాగే ఈ కాక్రోచ్ పార్టీ చేసే చప్పుడును కూడా ఎవరూ పట్టించుకోరు. కేవలం పబ్లిసిటీ కోసమే ఇలాంటి వింత చేష్టలు చేస్తున్నారు” అని ఒక అధికార ప్రతినిధి ఎద్దేవా చేశారు. ఏదేమైనా, 12 ఏళ్ల మోదీ పాలనలో ఎన్నడూ లేని విధంగా ఒక కొత్త పార్టీ ఏడు రోజుల గడువు విధించడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ 7 రోజుల్లో కేంద్రం స్పందిస్తుందా లేదా ఈ కొత్త పార్టీ తదుపరి అడుగు ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Srinidhi Shetty: ‘ఆదర్శ కుటుంబం’ శ్రీనిధికి టాలీవుడ్‌లో ఆఫర్స్ తెస్తుందా?

Srinidhi Shetty: కన్నడ బ్యూటీ శ్రీనిధి శెట్టికి తెలుగులో ఇప్పటి వరకూ సాలీడ్ దక్కలేదు. కన్నడలో ఆమె నటించిన కేజీఎఫ్…

2 weeks ago

Tollywood: నాని ‘బ్లడీ రోమియో’లో ఎంతమంది హీరోయిన్స్?

Tollywood: నేచురల్ స్టార్ నాని నటించబోతున్న లేటెస్ట్ మూవీ బ్లడీ రోమియో. సుజీత్ ఈ సినిమాకి దర్శకత్వం వహించబోతున్నాడు. ప్రస్తుతం,…

2 weeks ago

Puranapanda Srinivas: పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది

Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…

4 weeks ago

Eating An Apple: పడుకునే ముందు యాపిల్ తినడం మంచిదేనా…ఇది తెలుసుకోవాల్సిందే!

Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…

1 month ago

Tirumala Hundi: రికార్డు స్థాయిలో తిరుమల హుండీ ఆదాయం.. ఆరోజు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు!

Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…

1 month ago

Kidney Health: ఉదయం లేవగానే ఈ తప్పులు చేస్తున్నారా… మీ కిడ్నీ ప్రమాదంలో పడినట్లే?

Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…

1 month ago

This website uses cookies.