Pink Colour Fruits: సాధారణంగా మనకు మార్కెట్లో ఎన్నో రకాల పండ్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే కొన్ని రకాల పండ్లు చూడగానే తినాలనిపించే అంత ఆహ్లాదకరంగా కనబడుతూ ఉంటాయి. ముఖ్యంగా గులాబీ రంగులో ఉండే ఫ్రూట్స్ చూడటానికి ఎంతో ఆకర్షణగా ఉండటమే కాకుండా గులాబీ రంగులో ఉన్నటువంటి దానిమ్మ, లిచి డ్రాగన్ ఫ్రూట్స్ వంటి వాటిని తినటం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను మన సొంతం చేసుకోవచ్చు. మరి గులాబీ రంగులో ఉండే పండ్లు తీసుకోవడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి అనే విషయానికి వస్తే…
గులాబీ రంగులో ఉండే ఫ్రూట్స్ లో ఎక్కువగా ఆంథోసైనిన్స్, బీటాలైన్లు ఉంటాయి. అలాగే ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. డ్రాగన్ ఫ్రూట్స్ విషయానికి వస్తే.. వీటిలో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి కూడా తోడ్పడుతుంది అలాగే శరీర బరువు తగ్గడానికి ఫైబర్ ఎంతో దోహదం చేస్తుంది.
లిచీ పండులో 80 శాతానికి పైగా వాటర్ కంటెంట్ ఉంటుంది. ఇవి శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి దోహదం చేస్తుంది. అదేవిధంగా ఈ పండ్లలో కాపర్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. అందుకే ఈ పండు తరచూ తీసుకోవడం వల్ల గుండె పనితీరును మెరుగుపరుస్తుంది. అలాగే దానిమ్మలో కూడా ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి. ప్రతిరోజు ఈ పండ్లను తీసుకోవడం వల్ల అత్యధిక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.