Categories: LatestNewsPolitics

Pawan Kalyan: జూన్ నుంచి ప్రజల్లోకి జనసేనాని… వారాహి యాత్ర కూడానా?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలలో రాబోయే ఎన్నికలలో చాలా కీలకంగా మారబోతున్నారు అని ఇప్పటికే ఒక స్పష్టత వచ్చేసింది. పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు ద్వారా పోటీ చేసిన అన్ని నియోజకవర్గాలలో గెలవడంతో పాటు వైసీపీని కోలుకోలేని దెబ్బ తీయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ దిశగా తన ఒక్కో వ్యూహాన్ని అమలు చేసుకుంటూ వెళ్తున్నారు. పవన్ కళ్యాణ్ వ్యూహాలతో, నిర్ణయాలతో వైసీపీ అధిష్టానంకి ఇప్పటికే కలవరం మొదలైంది. నెలలో రెండు మూడు రోజులు రాజకీయ కార్యాచరణతో ప్రజల్లో ఉంటేనే వైసీపీ వారికి తలనొప్పిగా మారుతున్నాడు.

అదే పూర్తి స్థాయిలో రాజకీయాలు చేయడం స్టార్ట్ చేస్తే పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. జూన్ నుంచి మంగళగిరిలో అందుబాటులో ఉంటానని, పూర్తి స్థాయిలో రాజకీయ కార్యాచరణతో ప్రజలలోకి వెళ్ళే ప్లాన్ చేస్తానని పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చేశారు. నెలలో ఓ పది రోజులు మాత్రమే షూటింగ్ కోసం కేటాయించి మిగిలిన 20 రోజుల్లో ప్రజల మధ్య ఉండాలని నిర్ణయించుకున్నారు.  జూన్ తర్వాత పొత్తులపై కూడా ఒక స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అంతకంటే ముందుగానే రాష్ట్ర వ్యాప్తంగా  వారాహితో యాత్ర చేయడానికి పవన్ కళ్యాణ్ సిద్ధం అవుతున్నారు.

ఆగష్టు తర్వాత ఈ యాత్ర ఉండే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో వినిపిస్తోంది. ఇక యాత్ర మొదలు పెడితే గత ఎన్నికల ముందు టీడీపీ మీద ఎలా అయితే రాష్ట్ర వ్యాప్తంగా వ్యతిరేకత పెరగడానికి పవన్ కళ్యాణ్ కారణం అయ్యారో అలాగే వైసీపీ మీద వ్యతిరేకత పెంచడంలో సక్సెస్ అవుతాడని భావిస్తున్నారు. అయితే రానున్న రోజులు మాత్రం వైసీపీ బలమైన వ్యూహాలతో పవన్ కళ్యాణ్ ని ఎదుర్కోలేకపోయిన, ఎప్పుడు చేసినట్లే మూడు పెళ్ళిళ్ళు అంటూ ప్రచారం చేసిన అది ఆ పార్టీకి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి జూన్ నుంచి పవన్ కళ్యాణ్ వ్యూహాలతో ఎలా వైసీపీ ఎదుర్కొంటుంది అనేది వేచి చూడాలి.

Varalakshmi

Recent Posts

capsicum: క్యాప్సికంను తరచూ తీసుకుంటే… ఏం జరుగుతుందో తెలుసా?

capsicum: సిమ్లా మిర్చి, బెంగళూరు మిర్చి అంటూ రకరకాల పేర్లతో పిలిచే క్యాప్సికంను మన రోజు వారి ఆహారంలో తీసుకుంటే…

23 hours ago

Vinayaka Chavithi: వినాయక చవితి రోజు చేయాల్సిన పనులు ఏంటి ఏ రంగు దుస్తులు ధరించాలి!

Vinayaka Chavithi: మన హిందువులు జరుపుకునే పండుగలు వినాయక చవితి పండుగ కూడా ఒకటి. ఈ ఏడాది ఈ పండుగను…

23 hours ago

Health care: వ్యాయామం చేసిన తర్వాత ఈ పనులు చేస్తున్నారా.. మీరు ప్రమాదంలో పడినట్టే!

Health care: ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా వారి ఆరోగ్యం పై ఎంతో శ్రద్ధ పెడుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి…

2 days ago

Ganesh Pooja: రేపే వినాయక చవితి… విగ్రహ ప్రతిష్టకు సరైన సమయం ఏదో తెలుసా?

Ganesh Pooja: ప్రతి ఏడాది వినాయక చవితి పండుగను కుల మతాలకు అతీతంగా ఎంతో ఘనంగా జరుపుకుంటారు. అయితే వినాయక…

2 days ago

Fish: గర్భిణీ స్త్రీలు చేపలు తినడం మంచిదేనా… తింటే బిడ్డకు ఆ సమస్య ఉండదా?

Fish: గర్భం దాల్చిన మహిళలు తమ ఆరోగ్యం పై ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా కడుపులో పెరుగుతున్న…

3 days ago

Ganesh Pooja: వినాయక చవితి రోజు ఈ పువ్వుల సమర్పిస్తే చాలు.. అంతా శుభమే!

Ganesh Pooja: ప్రతి ఏడాది భాద్రపద మాసంలో వచ్చే చతుర్దశి రోజున వినాయక చవితి వేడుకను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.…

3 days ago

This website uses cookies.