Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే చూడాలని తెలుగు రాష్ట్రాలలో చాలా మంది యువత కోరుకుంటున్నారు. బలమైన ఆలోచన విధానం ఉన్న పవన్ కళ్యాణ్ అయితే భవిష్యత్తు బాగుంటుంది అని భావిస్తున్నారు. పవన్ కళ్యాణ్ లో యువత అంతా తమని తాము చూసుకుంటారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి విధానపరమైన నిర్ణయాలతో తనకు తానుగా ఓటమిని కొనితెచ్చుకుంటున్నారు అనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ లాంటి చరిష్మా ఉన్న వ్యక్తి ఎన్నికలలో పోటీ చేస్తే కచ్చితంగా ఎంతో కొంత ప్రభావం చూపించి కొన్ని స్థానాలు అయిన గెలుచుకునే అవకాశం 2014లో ఉంది.
అయితే అక్కడ వెనకడుగు వేసారు. ముఖ్యంగా జగన్ అధికారంలోకి రాకూడదు అనే ఆలోచనతోనే పవన్ కళ్యాణ్ పోటీ నుంచి తప్పుకున్నారు. ఇక 2019 ఎన్నికలలో అధికార పార్టీ టీడీపీకి దూరమైన పవన్ కళ్యాణ్, ఆరంభంలో ఆ పార్టీ వైఫల్యాలని ఎండగట్టారు. అయితే ఎన్నికలకి ఇంకా ఆరు నెలల సమయం ఉంది అనగా స్టాండ్ మార్చేసుకున్నారు జగన్ పై విమర్శల దాడి స్టార్ట్ చేశారు. అంత వరకు బలమైన ప్రతిపక్ష హోదాలో జనంలోకి వెళ్ళిన పవన్ కళ్యాణ్ ఇమేజ్ పూర్తిగా డ్యామేజ్ అయ్యింది. వైసీపీ అయితే చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ ప్రచారం షురూ చేసి లబ్ది పొందింది. అయితే ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఖండించకపోవడం కూడా ప్రజలు నిజమనే నమ్మారు.
మరల 2024 ఎన్నికలలో రెండు పార్టీలకి సమదూరం పాటిస్తూ తాను ముఖ్యమంత్రిగా ఏమర్జ్ అవ్వాలని పవన్ కళ్యాణ్ కోరుకోవాలి. దానికి విరుద్ధంగా వైసీపీని ఓడించడానికి పొత్తులు పెట్టుకుంటాం అంటూ సందేశం ఇచ్చారు. అన్ని పార్టీలు కలిసి పనిచేయాలని పిలుపునిస్తున్నారు. దీనిని టీడీపీ కరెక్ట్ గా వాడుకుంది. మళ్ళీ పవన్ కళ్యాణ్ టీడీపీకి పుంజుకునే ఛాన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎన్నికలకి మరో ఏడాది సమయం ఉండగా ఏపీలో మరల టీడీపీ, వైసీపీ మధ్యనే పోటీ అన్నట్లు వాతావరణం ఉంది. జనసేన ప్రస్తావన కూడా లేదు. అసలు సర్వేలు కూడా పవన్ కళ్యాణ్ ప్రభావం చూపిస్తారని అనుకోవడం లేదు.
రైతు భరోసా యాత్ర, జనవాణి ద్వారా పవన్ తెచ్చుకున్న మైలేజ్ మొత్తం టీడీపీకి వెళ్ళిపోయింది. ఇప్పుడు జనసేన క్యాడర్ లో కూడా నిర్లిప్తత ఆవహించింది. ఇప్పుడు కొత్తగా హరీష్ రావుపై వైసీపీ మంత్రులు విమర్శలు చేస్తే అదేదో తెలంగాణ జాతిని అవమానించినట్లు పవన్ కళ్యాణ్ ఫీల్ అయిపోయి వీడియో పోస్ట్ పెట్టారు. ఇది ఏ విధంగా కూడా జనసేనానికి మైలేజ్ తీసుకురాలేదు. దానికి తోడు బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకోవాలని పవన్ చూస్తున్నారు అంటూ కొత్త ప్రచారం తెరపైకి వచ్చింది. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక తప్పిదాలు కారణంగానే జనసేన భవిష్యత్తు ఏపీలో అగమ్యగోచరంగా ఉందనే మాట రాజకీయ విశ్లేషకుల నుంచి వినిపిస్తోంది.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.