Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చాలా కీలకంగా మారిన సంగతి అందరికీ తెలిసిందే. రానున్న ఎన్నికలలో జనసేన వ్యూహం బట్టి తెలుగుదేశం వైసిపి గెలుపు ఓటములు అనేది డిసైడ్ చేయబడి ఉంది. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం అధికార పార్టీ వైసిపి ఓటమి లక్ష్యంగా ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తన పంతా ఏంటి అనేది స్పష్టం చేసేసారు. అధికార పార్టీ వైసీపీని ఓడించడమే లక్ష్యంగా పొత్తులలో వచ్చే ఎన్నికలకు వెళ్తామని ప్రకటించారు. ఇక పవన్ కళ్యాణ్ తన నిర్ణయాన్ని ప్రకటించిన తర్వాత అధికార పార్టీ వైసీపీలో అలజడి మొదలైంది అని చెప్పాలి. వచ్చే ఎన్నికలలో ఎలా అయినా మరల అధికారంలోకి రావాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు జనసేన రూపంలో వైసీపీకి అత్యంత ప్రమాదకరమైన ప్రత్యర్థి ఉంది. జనసేన అధికారంలోకి వచ్చేంత సామర్థ్యం లేకపోయినా వైసిపి ఓటమి డిసైడ్ చేసే సత్తా కలిగి ఉంది. ఈ విషయం మీద వైసిపి అధిష్టానానికి స్పష్టంగా అవగాహన ఉంది. అందుకే ఎలా అయినా పవన్ కళ్యాణ్ ఇమేజ్ ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అమరావతిలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ కి వెళ్లారు. గతంలో ఉన్నంత ఆర్భాటం లేకుండా అంతా మీడియాకి దూరంగా జరుగుతూ ఉండడం విశేషం. విజయవాడలో కూడా పార్టీలో ముఖ్యనేతలతో అంతర్గత సమావేశాలు నిర్వహించినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
ముఖ్యంగా ఏపీలోని తమ బలం ఎంత అనేది వేసుకుని దిశగా చర్చలు నిర్వహించినట్లు తెలుస్తోంది. అయితే ఈ సమావేశంలో ఎవరెవరు పాల్గొన్నారు అనేది కూడా రహస్యంగానే ఉంచడం విశేషం. అయితే జనసేన ఎన్ని స్థానాలలో బలంగా ఉంది. వారాహి యాత్ర ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అనే అంశాలపై చర్చించినట్లు రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. జూలై నుంచి పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెడతామని ఇప్పటికే పవన్ కళ్యాణ్ చెప్పిన నేపథ్యంలో తాజాగా పార్టీ ఆఫీసు ప్రారంభోత్సవం ప్రాధాన్యతను సంతరించుకుంది.
Tollywood : డిజిటల్ యుగంలో మనకు ఎన్ని సౌకర్యాలు అందుతున్నాయో అన్నీ సవాళ్లు ఎదురవుతున్నాయి. టెక్నాలజీని సరిగ్గా వాడుకోకపోతే ఒక్కోసారి…
Tollywood: పాన్ ఇండియన్ స్టార్ హిట్ ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుసగా భారీ చిత్రాలకు సైన్ చేశారు. అంతేకాదు, ఏమాత్రం…
Akka: సౌత్ బ్యూటీ కీర్తి సురేశ్ తెలుగులో సినిమా చేసి చాలా గ్యాప్ వచ్చింది. మహేశ్ బాబు సరసన నటించిన…
Tollywood Cinema: బాలీవుడ్ స్టార్స్ ని ఎందుకు తీసుకుంటున్నారో మీకైనా అర్థం అవుతుందా..? గత కొంత కాలంగా మన తెలుగు…
Tollywood Cinema: 2025 సంక్రాంతికి మూడు భారీ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, ఈ మూడు…
జయ శంకర్ తాజాగా దర్శకత్వం వహించిన సినిమా అరి. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇప్పటికే షూటింగ్…
This website uses cookies.