Pawan Kalyan : హిట్ టాక్ వచ్చినా నిర్మాతలకి నష్టాలెందుకు..?

Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా అంటే ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వినిపించే సౌండే వేరు. బాక్సాఫీస్ లెక్కలు వేరు. ఫ్యాన్స్‌లో పూనకాలు అసాధారణం. మిగతా హీరోలందరూ ఓ మైల్ స్టోన్ అని భావించేది పవన్ కళ్యాణ్‌ని ఆయన సినిమా సక్సెస్‌ని. పవన్ బ్లాక్ బస్టర్ సినిమా వసూళ్ళు క్రాస్ చేయాలని తపనపడే హీరోలు మన టాలీవుడ్‌లో చాలామంది ఉన్నారు.

ఆయన పాన్ ఇండియా సినిమా తీయకపోయినా క్రేజ్, రేంజ్ ఆ రేంజ్‌కి ఎప్పుడో చేరుకుంది. కెరీర్ ప్రారంభంలో పవన్ కళ్యాణ్ సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద మంచి హిట్‌ని సొంతం చేసుకున్నాయి. అయితే, ఆయన రీ ఎంట్రీ తర్వాత చేసిన సినిమాలేవి నిర్మాతలకి ఆశించిన లాభాలను తెచ్చిపెట్టలేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఆయన మార్కెట్ స్టామినాకి తగ్గ సినిమాలు చేయకపోవడమే దీనికి ఓ ముఖ్య కారణం అని కూడా చెప్పుకుంటున్నారు.

pawan-kalyan-Even if there is a hit talk, why is the loss for the producers..?

Pawan Kalyan : వీరమల్లు సినిమా బడ్జెట్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది.

రీ ఎంట్రీ తర్వాత పరిశీలిస్తే ఇది నిజమని కూడా అనిపిస్తుంది. వకీల్ సాబ్ సినిమా ఆల్రెడీ హిందీ తమిళ భాషలలో చూసేయడం, కరోనా తర్వాత రిలీజ్ కావడం, ఏపీలో రిలీజ్ ఇబ్బందులు చూసుకుంటే నిర్మాత దిల్ రాజుకి పెద్ద ఒరిగిందేమీ లేదని చెప్పాలి. ఆ తర్వాత చేసిన భీమ్లా నాయక్. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా కూడా ఓవర్ బడ్జెట్ వల్ల నిర్మాతలకి నష్టాలే మిగిలాయి.

పవన్ కెరీర్‌లో ఫ్లాప్ సినిమాలు చాలానే ఉన్నాయి. అయితే, ఇప్పుడు పవన్ మార్కెట్ స్థాయి వేరే లెవల్. కానీ, ఆయన ఎంచుకుంటున్న కథలు ఆ స్థాయిలో ఉండటం లేదంటున్నారు అభిమానులు. హరి హర వీరమల్లు, వినోదాయ చిత్తం, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలు లైన్‌లో ఉన్నాయి. ఇప్పటికే వీరమల్లు సినిమా బడ్జెట్ పెరిగిందనే టాక్ వినిపిస్తోంది. అయితే, ఇది పాన్ ఇండియన్ సినిమా. 5 భాషలలో రిలీజ్ అవుతోంది. క్రిష్ దర్శకత్వం కాబట్టి సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా రాబట్టని వసూళ్ళు హరి హర వీరమల్లు రాబట్టి కొత్త రికార్డులు నమోదు చేస్తుందని అందరూ భావిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.

VSR

విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

Recent Posts

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ!

Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…

1 day ago

Allu Arjun: ‘మన శంకరవరప్రసాద్‌గారు’ సంక్రాంతి బాస్ బస్టర్..బన్నీ పోస్ట్ వైరల్!

Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…

1 day ago

Tollywood: బాక్సాఫీస్ అసలైన లెక్కలు తేలేది ఈరోజు నుంచే

Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…

3 days ago

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు!

MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…

4 days ago

Ashika Ranganath: టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా?

Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…

4 days ago

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఎవరో తెలుసా?

Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…

5 days ago

This website uses cookies.