Pawan Kalyan – Balakrishna – Unstoppable : గత కొన్ని రోజులుగా అన్‌స్టాపబుల్ 2 షో సోషల్ మీడియా లో ఓ రేంజ్ లో ట్రెండ్ అవుతోంది. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని చెప్పక తప్పదు. లీవుడ్ కింగ్, నందమూరి బాలకృష్ణ లేదా బాలయ్య హోస్ట్ చేస్తున్న అన్‌స్టాపబుల్ 2 లో పవన్ స్పెషల్ ఇంటర్వ్యూ ప్రసారం కాబోతోంది. ఈ ఎలెక్ట్రిఫయింగ్ ఎపిసోడ్ కోసం అభిమానులు కోటి కనులతో ఎదురు చూస్తున్నారు. ఆహా టీమ్ అదిరిపోయే ప్రోమోలు, గ్లింప్స్ ను వదులుతూ ఎపిసోడ్ పై భారీ అంచనాలను పెంచుతోంది.
ఎపిసోడ్ ఫిబ్రవరి 2 ,10 తేదీల్లో ప్రసారం కానుంది. ఈ క్రమంలో ఆహా ఓ అదిరిపోయే వీడియో ను రిలీజ్ చేసింది. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట్లో సునామి సృష్టిస్తోంది. ది బాప్ ఆఫ్ అల్ ఎపిసోడ్స్ అంటూ ఈ షార్ట్ వీడియోను ప్రారంభించారు. ఈ వీడియోలో పవన్ , బాలయ్య ఇద్దరూ ఓ రేంజ్ లో నవ్వుకుంటూ ఇంటర్వ్యూ కొనసాగిస్తారు. బాలయ్య గెస్ట్ వచ్చిన ప్రతిసారి ఓ ఆసక్తికరమైన గేమ్ వారితో ఆడిస్తుంటాడు. పవన్ తోనూ ట్రూ ఆర్ ఫాల్స్ గేమ్ ఆడించారు . ఇక్కడ పవన్ కు సంబంధించిన క్వశ్చన్స్ అడిగారు.
తమ్ముడు ఫైట్స్ మొత్తం డూప్ అంట కదా అని బాలయ్య ప్రశ్న అడగ్గానే పవన్ ఓ రేంజ్ లో నవ్వాడు . తన చేతిలో ఉన్న బోర్డు ను ఇట్లా తిప్పాలి అని పిస్తోంది అని పవన్ అనడం తో బాలయ్య నవ్వారు. నిజానికి ఆ షూట్ లో ఒక స్తంభాన్ని కొట్టాలి, అలా నేను కొడుతుంటే చేతి నుంచి రక్తం వస్తోంది. షార్ట్ అయిపోయిన తర్వాత డైరెక్టర్ ఎవరో దగ్గరికి రా అని అన్నానన్నారు. దీనితో ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో నవ్వుల పువ్వులు పూయించారు. దీనితో స్పెషల్ గ్లింప్స్‌లో అసలు మ్యాటర్ లీక్ అయ్యిందని అభిమానులు ఫుల్ ఖుషి అయ్యారు. పవన్ పార్ట్ 1 ఎపిసోడ్ రేపు రాత్రి 9 గంటలకు టెలికాస్ట్ కానుంది.
Puranapanda Srinivas : హైదరాబాద్, మే 2: పవిత్ర సంకల్పాలు బలంగా నెరవేరడానికి మహాగణపతి మంగళానుగ్రహం తప్పని సరిగా ఉండాలని,…
PURANAPANDA SRINIVAS : జంట నగరాలుగా భారతదేశంలో ప్రఖ్యాతి గాంచిన హైదరాబాద్, సికింద్రాబాద్‌లలో సుమారు ఆరు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర…
Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా సినిమా 'పెద్ది'. శ్రీరామనవమి పండుగ సందర్భంగా…
Sreeleela: టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీలకు షూటింగ్ సమయంలో ఒక చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల ఆమె షూట్ ముగిసిన…
Nagababu : శ్రీరామచంద్రుడన్నా , ఆంజనేయుడన్నా ఇష్టం ఉండనివారుండరని ప్రముఖ సినీ నటులు, శాసనమండలి సభ్యులు, జనసేన కార్యదర్శి కొణిదెల…
Tollywood : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటించిన భారీ యాక్షన్ మూవీ 'సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్'.…
This website uses cookies.