Food: ప్రతిరోజు చాలా రకాల ఆహారాలను తింటుంటాము. ఒక్కో ఆహారంతో ఒక్కో రకంగా మన శరీరానికి మేలు జరుగుతుంది. ప్రతి దాంట్లో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుంది. అందుకే ఆహారంలోనే ఔషధం ఉంది అంటుంటారు డైటీషియన్లు. అలాంటి ఆరోగ్యకరమైన రెసిపీతో మీ ముందకు వచ్చేశాము.
పన్నీర్ ను తినేందుకు చాలా మంది పెద్దగా ఆసక్తి చూపరు కానీ అందులో అందుబాటులో ఉండే పోషకాలను తెలుసుకుంటే తప్పక తింటానంటారు. ప్రోటీన్‌లు, కార్బోహైడ్రేట్లు, ఫోలెట్లు, విటమిన్లు, మినరల్స్ , కాల్షియం ఇలా ఎన్నో పోషకాలు పన్నీర్ లో నిక్షిప్తమై ఉన్నాయి. పన్నీర్‌ను రోజూవారి ఆహారంలో భాగం చేసుకోడం వల్ల ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి. ఛర్మం ఆరోగ్యంగా ఉండటంతో పాటు మెరుస్తుంటుంది. ఈ మధ్యన బరువు కోల్పోవాలనుకునే వారు కొద్ది మొత్తంలో పన్నీర్‌ను తీసుకుంటున్నారు. ఇందులో బరువు తగ్గించే లినోలెయిక్ ఆమ్లం పుష్కలంగా లభిస్తుంది. కాల్షియం, భాస్వరంలు పన్నీర్‌లో ఉండటం వల్ల ఎముకలు ధృడంగా ఉంటాయి. నీరసం, సిక్‌నెస్, తగ్గించి శరీరాన్ని యాక్టివ్‌గా మారుస్తుంటుంది.
పన్నీరు : 150 గ్రాములు
టమాటాలు : రెండు
వెల్లుల్లి రెబ్బలు : 4
నూనె :తగినంత
ఉప్పు : తగినంత
కొత్తిమీర : గుప్పెడు
బాస్మతీ రైస్ : రెండు కప్పులు
ఉల్లిగడ్డ : ఒకటి
క్యాబేజ్ : 1/2 కప్పు
కారం : 1 టీ స్పూన్
బ్లాక్ పెప్పర్ : 1/2 టీ స్పూన్
సోయా సాస్ : 1 1/2 టేబుల్ స్పూన్
తయారీ విధానం :
ముందుగా కూరగాయ ముక్కలను పన్నీర్ తో సహా చక్కగా కట్ చేసి పెట్టుకోవాలి. తరువాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని నూనె పోసుకోవాలి. నూనె కాస్త వేడెక్కాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలను , వెల్లుల్లిని నూనెలో వేసుకోవాలి. రెండు నిమిషాలు వాటిని వేగనివ్వాలి. ఇప్పుడు మంటను కాస్త పెంచి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు, క్యాబేజీ వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ రంగులోకి వచ్చే వరకు వాటిని వేగనివ్వాలి. ఇప్పుడు సోయా సాస్‌తో పాటు కారం, పెప్పర్ వేసుకోవాలి. ఇప్పుడు ఉడికించిన అన్నాన్ని లేదా రాత్రి మిగిలిన రైస్‌ను పన్నీర్ ముక్కలను కడాయిలో వేసుకోవాలి. 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్‌కు సరిపడా వేడి వేడి అన్నంపైన కొత్తిమీరతో గార్నిష్ చేసి హాట్ గా సర్వ్ చేస్తే పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారు.
మరి ఈ రెసిపీ మీకు నచ్చిందని భావిస్తున్నాము. ఎప్పుడైనా ఇంట్లో నైట్ మిగిలిన అన్నంతో ఇలా ఈజీ టు కుక్ రెసీపీస్‌ను ట్రై చేయండి.
Puranapanda Srinivas: హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు,…
Eating An Apple: ప్రతిరోజు ఒక ఆపిల్ తీసుకోవడం వల్ల మనం డాక్టర్ దగ్గరికి కూడా వెళ్లాల్సిన పనిలేదని చెబుతూ…
Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి…
Kidney Health: సాధారణంగా ఉదయం నిద్ర లేవగానే ప్రతి ఒక్కరూ వారికి ఉన్న అలవాట్లను ఫాలో అవుతూ వారి రోజున…
Lord Shiva:సాధారణంగా ప్రతి ఒక్కరు తమ జీవితంలో ఎన్నో రకాల కోరికలను కోరుతూ దేవుళ్లను ప్రార్థిస్తూ ఉంటారు.. తమ జీవితంలో…
Climbing Stairs: సాధారణంగా మనం అవలీలగా రెండు, మూడు అంతస్తులు మెట్లు ఎక్కగలం కానీ ఒక్కోసారి తక్కువ సంఖ్యలో మెట్లు…
This website uses cookies.