Pan India: ప్రస్తుతం సౌత్ ఇండియాలో పాన్ ఇండియా సినిమాల హవా పెరిగింది. స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమాలని పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథలను ఎంచుకుంటూ కెరియర్ బిల్ట్ చేసుకుంటున్నారు. నిర్మాతలు కూడా వందల కోట్ల బడ్జెట్ పెట్టడానికి సిద్ధమవుతుండడంతో హీరోలు కూడా తమ బ్రాండ్ పెంచుకోవాలని ప్రయత్నంలో ఉన్నారు. ఇదిలా ఉంటే సినిమాలు కోసం వందల కోట్లు ఖర్చుపెట్టిన కూడా ఒక మూవీ సక్సెస్ లో ప్రాథమిక సూత్రం అంటూ ఒకటి ఉంటుంది. ఎమోషనల్ కనెక్టివిటీ ఒక సినిమా సక్సెస్ చాలా కీలకం అని చెప్పాలి. ఎమోషనల్ ఎలిమెంట్స్ ప్రేక్షకులని కనెక్ట్ చేయలేకపోతే రిజల్ట్ ఎలా ఉంటుంది అనేది సాహో, రాదేశ్యామ్ సినిమాల ఫలితాలే నిదర్శనం.
అవుట్ ఆఫ్ ద వరల్డ్ అనే విధంగా సినిమాని ఆవిష్కరించిన కూడా కచ్చితంగా ప్రేక్షకులు ఆ సినిమాని చూసేటప్పుడు పాత్రలతోనూ, ఆ పాత్రల యొక్క బ్యాక్ స్టోరీ తోను ఎమోషనల్ కనెక్ట్ కావాలి. అప్పుడే ఆ హీరో పాత్ర లో ఎలాంటి బీభత్సమైన పర్ఫామెన్స్ చేసిన కూడా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారు. ఈ విషయంలో రాజమౌళి చాలా పర్ఫెక్ట్ అని చెప్పాలి. హై వాల్యూమ్ లో సినిమాలు తీసిన కూడా ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్ ఏంటి అనేది గ్రహించి ప్రతి క్యారెక్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ బిల్డ్ చేసుకొని దానిని తెరపై అద్భుతంగా ఆవిష్కరిస్తారు. ఈ కారణంగానే రాజమౌళి సినిమాలన్నీ కూడా హిట్ అవుతుంటాయి.
అలాగే కమర్షియల్ చిత్రాలు చేసే అనిల్ రావిపూడి కూడా స్టోరీలో ఒక బలమైన ఎలిమెంట్ ని రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. దానిని ఒక పాయింట్ లో రివిల్ చేసి ప్రేక్షకుల్ని కన్విన్స్ చేస్తారు. ఈ కారణంగానే అతని సినిమాలన్నీ కూడా సక్సెస్ అయ్యాయి. ప్రస్తుతం టాలీవుడ్ లో పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి. ఈ సినిమాలపై వేల కోట్ల వ్యాపారం జరుగుతుంది. అయితే నేటివిటీ, ఎమోషనల్ కనెక్టివిటీ అనేది సినిమాకి ఎంత ప్రాధాన్యత అనేది సదరు దర్శకులు గుర్తించి సినిమాలను చేస్తే కచ్చితంగా సక్సెస్ అవుతాయి. ఒక పుష్ప సక్సెస్ అయిన, కాంతారా, కేజీఎఫ్ సిరీస్ సక్సెస్ అయిన అందులో ఉండే ఎమోషనల్ కనెక్టివిటీ లైన్ అనేది చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. మరి వాటిని ఎంతవరకు మన పాన్ ఇండియా దర్శకుడు రిప్రజెంట్ చేస్తారు అనేది చూడాలి.
Virinchi Varma: సినిమా ఇండస్ట్రీలో ఒక్కో దర్శకుడి ఒక్కో అభిరుచి ఉంటుంది. దాని ప్రకారమే వారు ఎంచుకునే కథ, కథనాలు…
Raashii Khanna: పెళ్ళి, పిల్లలు నా వ్యక్తిగతం..దాని గురించి చర్చ ఎందుకు..? అంటోంది అందాల తార రాశిఖన్నా. ఊహలు గుసగుసలాడే…
Tollywood: 'నువ్వు నందా అయితే నేను బద్రి బద్రీనాద్ అయితే ఏంటీ'? 'ఎవడు కొడితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాకైపోద్దో…
SSMB29: సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో ఓ భారీ అడ్వంచర్ మూవీకి…
The Raja Saab: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం 'రాజా సాబ్'. మిగతా భాషల్లో 'ది…
Tollywood: పవన్ ఈజ్ బ్యాక్.. 2025 లో వీరమల్లు, ఓజీ ఒకదాని తర్వాత ఒకటి అత్యంత భారీ స్థాయిలో ప్రపంచవ్యాప్తంగా…
This website uses cookies.