Rakul Preet Singh:టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న నటి రకుల్ ప్రీత్ సింగ్. ఈ బ్యూటీ వెంకటాద్రి ఎక్స్ ప్రెస్ మూవీతో కెరియర్ లో మొదటి హిట్ కొట్టింది. ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే అవకాశం లేకుండా వరుసగా స్టార్ హీరోలతో అవకాశాలు సొంతం చేసుకుంటూ టాప్ చైర్ లోకి దూసుకొచ్చింది.
ఇక తెలుగులో ఆమె చివరిగా కొండపొలం సినిమాలో నటించింది. అంతకుముందు ఓ మూడు హిందీ సినిమాలలో చేసి హిట్టు కొట్టిన రకుల్ ప్రీతిసింగ్ కి తర్వాత వరుసగా ఆఫర్స్ క్యూ కట్టాయి. దీంతో బాలీవుడ్ లో ఫుల్ బిజీ అయిపోయిన ఈ అమ్మడు ఇక తెలుగు వైపు కన్నెత్తి చూడలేదు.
గత ఏడాది ఏకంగా ఐదు సినిమాలను ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చింది. ఇక హిందీలో అటు సీనియర్ స్టార్ హీరోలతో ఇటు యంగ్ హీరోలతో వరుసగా జతకడుతూ మూవీస్ చేస్తుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ఏకంగా తమిళ్, హిందీ కలిపి ఐదు సినిమాల వరకు ఉన్నాయి.
ఇదిలా ఉంటే బాలీవుడ్ లోకి అడుగు పెట్టిన తర్వాత రకుల్ ప్రీత్ సింగ్ గ్లామర్ డోస్ పెంచింది అని చెప్పాలి. అక్కడ పోటీలో నిలబడాలంటే కచ్చితంగా అందాల ప్రదర్శనలో కూడా బాలీవుడ్ భామలకు ఏమాత్రం తీసుకొని విధంగా ఉండాలి. రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ హాట్ ఫోటో షూట్ లు చేస్తూ సందడి చేస్తూ ఉండాలి.
ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ కూడా రెగ్యులర్ గా హాట్ ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేస్తూ ఫాలోవర్స్ కు వినోదం అందిస్తుంది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లో నటుడు నిర్మాత జాకీ బాగ్నానితో గత కొంతకాలంగా రకుల్ ప్రేమాయణం సాగిస్తున్న సంక్రాంతి తెలిసిందే. ఈ నేపథ్యంలో త్వరలో ఆమె పెళ్లి పీటలు కూడా ఎక్కబోతుందని తెలుస్తుంది.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.