O G – Pawan Kalyan : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా ఓజీ. తాజాగా ఈ సినిమా నుంచి పవర్ ఫుల్ పోస్టర్ ని చిత్ర బృందం రిలీజ్ చేసింది. పవన్ కళ్యాణ్ లుక్ తో పాటు ప్రేక్షకులకి, అభిమానులకి విజయదశమి పండుగ శుభాకాంక్షలు తెలిపింది చిత్ర యూనిట్. ఈ లుక్ చూస్తే చాలు రెండు తెలుగు రాష్ట్రాలైన ఏపీ, తెలంగాణా జనం అలా పడి ఉంటారంతే అంటూ పవన్ అభిమానులు చెప్పుకుంటున్నారు.
వకీల్ సాబ్ చిత్రం తర్వాత వరుసగా పవర్ స్టార్ సినిమాలను కమిటైన సంగతి తెలిసిందే. ఒకవైపు రాజకీయాలలో బిజీగా ఉంటూనే సినిమాలకి డేట్స్ కేటాయిస్తున్నారు. ఒక్కో సినిమాని కంప్లీట్ చేస్తూ వస్తున్న పవన్ కళ్యాణ్.. ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాలను శరవేగంగా పూర్తి చేసే పనిలో ఉన్నారు. 2014లో వచ్చే ఏపీ ఎలక్షన్స్ వరకూ ఈ రెండు సినిమాలలో ఆయన పార్ట్ వరకూ కంప్లీట్ చేసేందుకు డేట్స్ ఇచ్చినట్టు సమాచారం.
ఇక హరిహర వీరమల్లు చిత్రానికి సంబంధించిన షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ ప్రాజెక్ట్ ఆగిపోయినట్టు ఇంతకముందు వార్తలు వచ్చాయి. అవన్నీ పుకార్లేనని ఆ బ్రో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత ఏ ఎమ్ రత్నం క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే 60 శాతం చిత్రీకరణ పూర్తైన వీరమల్లు మిగతా షూటింగ్ కంప్లీట్ చేసి 2024 సమ్మర్ కానుకగా విడుదల చేసే ఆలోచనలో మేకర్స్ ఉన్నారు. ఇది పాన్ ఇండియన్ సినిమా కావడం విశేషం. క్రిష్ ఈ చిత్రానికి దర్శకుడు.
ఇక తాజాగా ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాల నుంచి పీకే లుక్స్ విడుదలవగా, ఫ్యాన్స్ తో పాటు కామన్ ఆడియన్స్ వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ వైరల్ చేస్తున్నారు. ఓజీ పోస్టర్ లో పవర్ ఫుల్ లుక్ తో కనిపిస్తున్న పవన్ కళ్యాణ్, ఉస్తాద్ పోస్టర్ లో పోలీస్ యూనిఫారం లో పెద్ద సుత్తి పట్టుకొని సైడ్ లుక్ లో అదిరిపోయారు. ఇలాంటి పోస్టర్ చూసి చాలా రోజులైంది.. అంటూ ఫ్యాన్స్ మాట్లాడుకుంటున్నారు. కాగా, ఓజీ చిత్రాన్ని సుజీత్, ఉస్తాద్ భగత్‌సింగ్ చిత్రాన్ని హరీశ్ శంకర్ తెరకెక్కిస్తున్నారు.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.