NTR Devara : దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన RRR చిత్రంలో తన యాక్టింగ్ తో అదరగొట్టాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. కొమరం భీం పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను అల్లరించాడు. ఈ మూవీతో వరల్డ్ ఫేమస్ స్టార్ట్ అయిపోయాడు. ఎన్టీఆర్. ఆస్కార్ అవార్డు కూడా సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా అందరి దృష్టి ఎన్టీఆర్ పడింది. ఈ మూవీ తర్వాత కాస్త గ్యాప్ తీసుకొని ఫ్యామిలీతో కాస్త టైంలో స్పెండ్ చేసిన ఎన్టీఆర్ లేటెస్ట్ గా దేవర సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ జోడీగా నటిస్తున్న మూవీ దేవర. కొరటాల శివ ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే మువీకి సంబంధించి విడుదలైన పోస్టర్స్ సినిమాపై భారీ అంచనాలను పెంచాయి. ఈ నేపథ్యంలో డైరెక్టర్ కొరటాల దేవరకు సంబంధించి అదిరిపోయే అప్ డేట్ ఇచ్చారు. ఈ మూవీ రెండు భాగాలుగా వస్తున్నట్లు తెలిపారు. దీనితో 2024 ఏప్రిల్ 5న ఫస్ట్ పార్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తుందని అనౌన్స్ చేశారు. ఈ మేరకు ఓ వీడియో రిలీజ్ చేసి ఫ్యాన్స్ ను ఖుషి చేశారు. దేవర ను రెండు పార్ట్స్ గా ఎందుకు తీసుకొస్తున్నారో చెప్పారు.
“దేవర సినీ లవర్స్ కు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. ఇందులో స్ట్రాంగెస్ట్ పాత్రలు ఎన్నో ఉన్నాయి. ఈ మూవీని ఎంత ఉత్సాహంగా ప్రారంభించామో.. అదే ఊపుతో సినిమా తీయాల్సిన దానికన్నా పెద్దదై పోయింది. ఇప్పటివరకు తీసిన సన్నివేశాలు , ఔట్ పుట్ మా టీమ్ లో డబుల్ ఎనర్జీని పెంచింది. ఎడిటింగ్ చేస్తున్నప్పుడు ఒక్క సీన్, ఒక్క డైలాగ్ ను కూడా తీసేయలేక పోయాం . మేమంతా చాలా ఎమోషనల్ అయ్యాం. అదే సమయంలో ఒక మూవీ ని పెద్దగా నిర్మించడం సరైనది కాదు. అలాగని సూపర్బ్ గా వచ్చిన సీన్స్ ను డిలీట్ చేయడం ఎవరికీ నచ్చలేదు. సినిమా మొత్తం చూపించాలంటే.. రెండు పార్ట్ గా తెరకెక్కించాలి. పాత్రలు, వాటి ఎమోషన్స్ పూర్తిస్థాయిలో చూపిస్తాం” అంటూ కొరటాల శివ చెప్పుకొచ్చారు.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.