NTR Devara : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరంలేని పేరు యంగ్ టైగర్ జూ.ఎన్టీఆర్. సీనియర్ హీరో తాత నందమూరి తారకరామారావు వారసుడుగా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చాడు. అతి తక్కువకాలంలోనే తనదైన యాక్టింగ్ తో తెగులు ప్రేక్షకుల హృదయాల్లో స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎంతటి భారీ డైలాగ్ అయినా అవలీలగా పలికేస్తూ, కళ్లు చెదిరే డ్యాన్స్ మూమెంట్స్ తో మెస్మరైజ్ చేస్తూ వెండితెరపైన తనదైన మ్యాజిక్ క్రియేట్ చేయడంలో ఎన్టీఆర్ తోపు అనే చెప్పాలి. సినిమాలకు సంబంధించి ప్రతి అంశంలో ఆయన రూటే సపరేటు. ఈ మధ్యనే దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ దేవరలో నటిస్తున్నాడు. ఇవాళ ఎన్టీఆర్ పుట్టినరోజు కావడంతో మేకర్స్ ఈ సినిమా నుంచి ఓ సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో ఈ సాంగ్ ట్రెండింగ్ లో ఉంది.మ్యూజిక్ డైరెక్టర్ అనిరుథ్ అరిపించాడు భయ్యా అంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.
తెలుగు ఇండస్ట్రీలో మాన్ ఆఫ్ మాసెస్ గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ దేవరతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాడు. కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ మూవీ వరల్డ్ వైడ్ గా బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. దేవర మూవీ రెండు భాగాలుగా రాబోతోంది. మొదటి భాగాన్ని అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నారు. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళంలో అత్యంత భారీగా సినిమాను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
ప్రమోషన్స్ లో భాగంగా దేవర నుంచి ఫస్ట్ సింగిల్ ను ఎన్టీఆర్ పుట్టిన రోజు గిఫ్ట్ గా రిలీజ్ చేశారు. ప్రకటించిన దాని మేరకు సాంగ్ ను రిలీజ్ చేశారు. మూడు నిమిషాల 16 సెకన్ల డ్యూరేషన్ ఉన్న ఈ సాంగ్ అందరికీ గూజ్ బంప్స్ తెప్పిస్తోంది. తెలుగు సహా హిందీ, తమిళ వెర్షన్స్ కి అనిరుధ్ మ్యూజిక్ అందిస్తూనే పాట కూడా పాడాడు. దేవర మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది. ఇక వార్ 2తోనూ ఎన్టీఆర్ బాలీవుడ్‍లో ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ చిత్రంలో హృతిక్ రోషన్‍తో కలిసి మెయిన్ రోల్ లో నటిస్తున్నాడు.. ఈ సినిమా నుంచి కూడా ఈరోజు అప్డేట్ రావచ్చునని టాక్.. ఈ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ కాంబోలో ఓ సినిమా చేస్తున్నాడు.. ప్రస్తుతం ఆ సినిమా ప్రీ ప్రోడక్షన్ పనుల్లో బిజీగా ఉంది.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.