NTR 30 : నాలుగు బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు కూడా ఒక్క ఫ్లాప్ చూస్తే మళ్ళీ అవకాశం రావడం గగనం అని ఇప్పటికే చాలామంది దర్శకులతో ప్రూవ్ అయింది. అలాంటి జాబితాలో ఇప్పుడు సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న కొరటాల శివ చేరారు. నాలుగు భారీ కమర్షియల్ హిట్స్. అన్నీ పెద్ద హీరోలతో చేసిన సినిమాలే. కానీ, ఒక్క ఫ్లాప్ ఆయనని డైలమాలో పడేసింది. ప్రభాస్ హీరోగా మిర్చి, మహేష్ బాబుతో శ్రీమంతుడు, ఎన్.టి.ఆర్ హీరోగా జనతా గ్యారేజ్..మళ్ళీ మహేష్ బాబుతో భరత్ అనే నేను.
ఇలా నాలుగూ బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించిన సినిమాలే. నిర్మాతలు ఫుల్ హ్యాపీ. ఇండస్ట్రీలో మైత్రీ మూవీ మేకర్స్ నిలబడింది అంటే దానికి ఒక రకంగా కొరటాల శివనే కారణం అని చెప్పాలి. అయితే, మెగాస్టార్ చిరంజీవి-మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా కొరటాల రూపొందించిన ఆచార్య మాత్రం భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీనికి కొందరు కొరటాలని నిందిస్తే కొందరు మాత్రం సమర్ధించారు.
ఆయనకి ఫ్రీడమ్ ఇచ్చి ఉంటే ఆచార్య అలా డిజాస్టర్ అయ్యేది కాదన్న మాట కూడా ఆ మధ్య బలంగా వినిపించింది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అయినా సరే ఒక్క ఫ్లాప్ ఇస్తే ఇండస్ట్రీలో ఎలాంటి అనుభవాలను చూడాలో అవి కొరటాల కూడా చూశారు. ఒక దశలో ఆయన ఎన్.టి.ఆర్ హీరోగా తీయాల్సిన సినిమా కూడా ఆగిపోయిందని ప్రచారం చేశారు. అవన్నీ తట్టుకొని ఇటీవలే ఈ ప్రాజెక్ట్‌ను మొదలు పెట్టారు. హిట్ ఇస్తానని చాలా నమ్మకంగా మాటిచ్చారు.
ఇది నిజంగా కొరటాలకి చాలా ఠఫ్ టైమ్ అని చెప్పక తప్పదు. ఎన్.టి.ఆర్ 30 రిజల్ట్ ఏమాత్రం తేడా కొట్టినా ఇక ఆయన కెరీర్ అంతే. కానీ, కొరటాల కసి చూస్తే బాక్సాఫీస్ బద్దలు కొట్టబోతున్నాడనిపిస్తోంది. కాగా, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ క్రేజీ మూవీలో అందాల తార శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది. జాన్వీకి తెలుగులో ఇది మొదటి సినిమా కావడం విశేషం.
Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…
Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…
YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…
Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…
Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…
Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…
This website uses cookies.