Nithya Menon : బక్కచిక్కిన నిత్యా మీనన్..లేటెస్ట్ గ్లామర్ పిక్స్ వైరల్

Nithya Menon : హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న నిత్యా మీనన్ గత కొంత కాలంగా కమర్షియల్ సినిమాలకు దూరంగా ఉంటూ, నైపుణ్యం ఉన్న కథలను ఎంచుకుంటూ తనకు నచ్చే క్యారెక్టర్లను చేస్తూ ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తోంది. అయితే ఈ మలయాళ కుట్టి గత కొంత కాలంగా ఒళ్లు చేయడంతో సోషల్ మీడియాలో భామను చాలా రకాలుగా ట్రోల్ చేశారు. ఒకానొక సమయంలో శరీరంలోని కొవ్వును తగ్గించుకునేందకు సర్జరీ చేయించుకోవాలని కూడా చాలా మంది తనకు సలహాలు ఇచ్చారు.

nithya-menon-tremendous-wait-change-in-nitya-sincere-diet-plan-for-wait-loos

అయితే తినడం వల్లనో లేదా సోమరితనం వల్లనో బరువు పెరుగుతారని భావించే వారు అజ్ఞానులను తనపై కామెంట్ చేసిన వారికి గట్టిగానే గతంలో సమాధానం చెప్పింది నిత్యా మీనన్. అయితే ఈ మధ‌్య తన వెయిట్ పై దృష్టిసారించిన నిత్యా అమేజింగ్ మార్పుతో మళ్లీ కనిపించి అందరినీ అవాక్కు చేసింది. తన ఫ్యాట్‌ను తగ్గించుకుని ఫెయిర్‌గా కనిపిస్తూ ఫ్యాన్స్‌ను ఆకర్షిస్తోంది నిత్యామీనన్.

nithya-menon-tremendous-wait-change-in-nitya-sincere-diet-plan-for-wait-loos

తమిళం, తెలుగు, మలయాళం, హిందీ సినిమాల్లో తనదైన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామీనన్. తెలుగులో అలా మొదలైంది సినిమాతో తెరంగేట్రం చేసి మొదటి సినిమాతోనే తన టాలెంట్‌ను ప్రూవ్ చేసుకుంది ఈ చిన్నది. ఈ మలయాళి కుట్టీకి క్రేజ్ పెరగడంతో టావీవుడ్‌లో మంచి అవకాశాలనే దక్కించుకుంది. దాదాపు స్టార్ యువ నాయకులతో జోడీ కట్టి వారితో సమానంగా నటించి ప్రేక్షకుల హృదయాల్లో చోటను సంపాదించుకుంది. గుండెజారి గల్లంతయ్యిందే, ఇష్క్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, మెర్సల్, మిషన్ మంగల్, స్కౌల్యాబ్, బీమ్లానాయక్, ఇలా అనేక చిత్రాల్లో తన వైవిధ్యమైన నటనతో ఫ్యాన్స్ ఫాలోయింగ్‌ను పెంచుకుంది ఈ బ్యూటీ. ఆమె నటనకు గాను ఫిల్మ్‌ఫేర్ అవార్డులను అందుకుంది నిత్యా.

nithya-menon-tremendous-wait-change-in-nitya-sincere-diet-plan-for-wait-loos

అయితే గత కొంతకాలంగా నటి తన బరువుకు సంబంధించి విమర్శలను ఎదుర్కొటోంది. బాడీ షేమింగ్ ను కాస్త సీరియస్ గా తీసుకున్న నిత్యా సీరియస్ డైట్‌ప్లాన్ చేసిమరీ తన బరువును తగ్గించుకుంది. సోషల్ మీడియాలో నిత్యా పోస్ట్ చేసిన పిక్స్ ఆమె లేటెస్ట్ లుక్‌ను ప్రతిబింబిస్తోంది. మళ్లీ తనలోని పాత నిత్యను చూపించింది. ప్రస్తుతం నిత్యా లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అమ్మడి వెయిట్ లాస్‌ పైన పెద్ద ఎత్తున చర్చే నడుస్తోంది.

nithya-menon-tremendous-wait-change-in-nitya-sincere-diet-plan-for-wait-loos

సోమరితనం వల్లనో, తినడం వల్లనో బరువు పెరగరని, హార్మోన్‌ల ప్రభావం, లేదా మరే సమస్య ఉన్నా బరువు పెరుగుతారన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ముఖ్యంగా నటీనటులు సోమరులు కాదని ఆమె తెలిపారు. బాడీ షేమింగ్ అనేది అత్యంత బాధాకరమైన విషయమని నిత్యా తెలిపింది. వెయిట్ లాస్ కోసం సర్జరీకి వెళ్లకుండా కంప్లీట్ డైట్ ద్వారానే హెల్దీగా తగ్గి తోటి బొద్దుగుమ్మలకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తోంది.ఏది ఏమైనా అలా మొదలైంది సినిమాలో తన  జర్నీ స్టార్ట్ అయినప్పుడు ఈ మలయాళ కుట్టి ఎలా ఉందో ఇప్పుడు అలాగే కనిపిస్తూ తన ఫ్యాన్స్‌లో కొత్త జోష్ తీసుకువస్తోంది.

Sri Aruna Sri

Recent Posts

Big Breaking: చంచల్‌గూడా జైలు నుంచి ఈరోజు 6 గంటలకు అల్లు అర్జున్ విడుదల

Big Breaking: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈరోజు (డిసెంబర్ 14) ఉదయం 6 గంటలకి చంచల్‌గూడా జైలు నుంచి…

1 week ago

Big Breaking: అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన హైకోర్ట్

Big Breaking: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి హైకోర్ట్ తాజాగా మధ్యంతర బెయిల్ ని మంజూరు చేస్తూ ఉత్తర్వులు…

1 week ago

YS Jagan Mohan Reddy: అల్లు అర్జున్ అరెస్ట్‌పై వైఎస్ జగన్మోహన్ రెడ్డి పోస్ట్ వైరల్

YS Jagan Mohan Reddy: సంధ్య థియేటర్స్ వద్ద పుష్ప 2 సినిమా చూసేందుకు వచ్చి తొక్కిసలాటలో మృతి చెందిన…

1 week ago

Breaking News: అల్లు అర్జున్ కి 14 రోజుల రిమాండ్..!

Breaking News: టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్ కి నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధిస్తూ సంచలన తీర్పునిచ్చింది.…

1 week ago

Allu Arjun Arrest: సంధ్య థియేటర్ తొక్కిసలాటలో అల్లు అర్జున్ అరెస్ట్..!

Allu Arjun Arrest: 'పుష్ప 2' చిత్రం విడుదల సందర్భంగా హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య థియేటర్…

1 week ago

Pushpa 2: The Rule Review; ‘వెయ్యి కోట్లు తగ్గేలే’..’తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే’..!

Pushpa 2: The Rule Review; "వెయ్యి కోట్లు తగ్గేలే".."తగ్గినా తగ్గొచ్చు చేసేదేం లే"..! అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో…

3 weeks ago

This website uses cookies.