Nithya Menon : అలా మొదలైంది మూవీలో టాలీవుడ్ కి పరిచయమైంది మలయాళి బ్యూటీ నిత్యామీనన్ . ఫస్ట్ మూవీతోనే తన పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఫిదా చేసేసింది. తన అందం, అభినయంతో పాటు ఎక్స్ట్రా సింగింగ్ టాలెంట్ తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది. పొట్టిగా ఉన్నా తన పుట్టెడు తెలివితేటలతో అందరినీ పడేసింది. కేవలం కళ్ళతోనే హావభావాలు పలికించి మంచి పాపులారిటీ సంపాదించింది. టాలీవుడ్ లో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి స్టార్డమ్ ఉన్న నటి నిత్యా. ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, నితిన్, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, శర్వానంద్, నాని, సూర్య వంటి స్టార్ హీరోల తో యాక్ట్ చేసి వారికే టఫ్ కాంపిటీషన్ ఇచ్చింది. ఈ మధ్యనే కోలీవుడ్ సూపర్ స్టార్ ధనుష్ తో తిరు అనే మూవీ చేసి హిట్ కొట్టింది. ఆ సినిమా తర్వాత కొంత గ్యాప్ ఇచ్చింది. ఇప్పుడు మళ్లీ వెబ్ సిరీస్ లతో మళ్లీ ఫామ్ లోకి వచ్చింది.
ఇదిలా ఉంటే తాజాగా నిత్యా ప్రభాస్ గురించి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అప్పట్లో అలా మొదలైంది సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మీడియా నిత్యామీనన్‌ని ప్రభాస్ గురించి ప్రశ్నించింది. అప్పుడు నిత్యా అమాయకంగా ప్రభాస్ ఎవరో నాకు తెలియదు అని చెబితే దానిని సెన్సేషన్ చేశారు. ఈ బ్యూటీని ప్రభాస్ ఫ్యాన్స్, సినీ లవర్స్ , తెలుగు ఆడియన్స్ దారుణంగా ట్రోల్స్ చేశారు. ఈ దెబ్బతో నిత్య ఎక్కడికి వెళ్ళిన మీడియా ప్రభాస్ గురించిన ప్రశ్నలనే అడగటం మొదలు పెట్టారు. తెలుగు సినిమా చేస్తున్నావ్ ప్రభాస్ ఎవరో తెలియదా అంటూ అడిగేవారట. అంతే కాదు ఆమెకు పొగరెక్కువ అందుకే అలా సమాధానం ఇస్తోందని కూడా విమర్శించేవారట.
ఈ సంఘటనతో తనకి అసలేం జరుగుతుందో అర్థం కాలేదని తాజాగా నిత్య మీనన్ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.” అలా మొదలైంది సినిమా చేస్తున్నప్పుడు నేను చాలా చిన్న అమ్మాయిని. నాకు తెలుగు సినిమాల గురించి పెద్దగా ఏమీ తెలియదు. ఇంకా చెప్పాలంటే తెలుగు సినిమాలు ఒక్కటి కూడా చూడలేదు. టాలీవుడ్ లో ఎవరెవరు ఉన్నారో కూడా నాకు పెద్దగా ఐడియా లేదు. ఆ టైంలో ప్రభాస్ గురించి అడగగానే నాకు తెలియదు కాబట్టి తెలియదు అని చెప్పాను. దానికి ఏదో పాపం చేసినట్లు నన్ను మానసికంగా వేధించారు. అది నా లైఫ్ లో చాలా గట్టిగా తగిలిన ఎదురుదెబ్బ. ఆ ఒక్క సంఘటనతో నేను చాలా నేర్చుకున్నా. ప్రతి చోటా నిజాయతీగా ఉండకూడదని డిసైడ్ అయ్యాను”అని నిత్యా మీనన్ తెలిపింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.