Nithya Menon : సినీ సెలబ్రిటీల పెళ్లిళ్లు, విడాకులు, అఫైర్లపై ఎప్పుడూ ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం ఈ మధ్య కాలంలో కామనైపోయింది. లేటెస్టుగా మలయాళ ముద్దుగుమ్మ నిత్యామీనన్ పెళ్లి గురించి ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఓ స్టార్ హీరోతో నిత్యా పెళ్లి అంటూ రూమర్స్ నెట్టింట్లో ప్రత్యక్షమవుతున్నాయి. అంతే కాదు వీరు లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. గత వారం రోజులుగా ఇదే న్యూస్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలోనూ నిత్య పెళ్లిపై ఇలాంటి రూమర్సే వచ్చాయి. అయితే తాజాగా ఈ కుట్టీ పెళ్లి పుకార్లపై మలయాళ మీడియాకు క్లారిటీ ఇచ్చింది. ఇంకా పెళ్లి చేసుకోకపోవడంపై కూడా ఆమె స్పందించింది. ప్రస్తుతం నిత్య కామెంట్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
అలా మొదలైంది సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది నిత్యా మీనన్. మొదటి సినిమా అయినా ఈ మలయాళ కుట్టి ఎంతో న్యాచురల్ గా నటించి అందరి హృదయాలను దోచేసింది. బొద్దుగా , ముద్దుగా ముద్దమందారంలా ఉండే ఈమె అందానికి అభినయం తోడవడంతో తెలుగువారికి దగ్గరైంది. తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినా మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం భాషల్లోనూ తన యాక్టింగ్ తో మంచి క్రేజ్ తెచ్చుకుంది. నిత్యామీనన్ కేవలం నటి మాత్రమే కాదు..ఆమెలో మంచి సింగర్ ఉంది. పలు సినిమాల్లోనూ పాటలు పాడి అలరించింది ఈ ముద్దుగుమ్మ. అయితే గత కొంత కాలంగా టాలీవుడ్ నుంచి చెప్పుకోదగ్గ ఆఫర్స్ అమ్మడికి ఏమీ రాలేదు. ఇక్కడ కాస్త స్పీడ్ తగ్గించినా మలయాళంలో మాత్రం అడపాదడపా సినిమాలు చేస్తుంది . ఇదిలా ఉంటే ఈ బ్యూటీకి ప్రస్తుతం 36 ఏళ్లు. అయినా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. ఎక్కడా కూడా నిత్యా పెళ్లి ఊసే ఎత్తలేదు. ఇక ఇప్పుడు ఓ స్టార్ హీరోతో పెళ్లి అన్న వార్తలు నెట్టింట్లో ప్రత్యక్షమవ్వడంతో మీడియా ముందుకు వచ్చి ఓ ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది.
” ఏమి చేయాలో, ఏమి చేయకూడదో మరొకరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. పెళ్లి విషయంలో నాకంటూ కొన్ని అభిప్రాయాలు ఉన్నాయి. మా పేరెంట్స్ నన్ను అర్థం చేసుకున్నారు. వారు నాకు పెళ్లి విషయంలో ఫ్రీడం ఇచ్చారు. నేను స్వేచ్ఛ లేకుండా బ్రతకలేను. అది మా తల్లిదండ్రులకు తెలుసు. ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలని మా అమ్మమ్మ ఒత్తిడి చేసేది. ఆమె చనిపోయాక ఎవరూ పట్టించుకోలేదు. నిజానికి నేను హీరోయిన్ కావాలని మా అమ్మమ్మ కోరుకోలేదు. అందుకే పెళ్లి చేసుకోమని ప్రెజర్ తెచ్చేది. ఆమె ఇప్పుడు లేరు. ఆమె తప్ప నా పెళ్లి విషయంలో ఎవరూ పెద్దగా బాధపడరు”అని నిత్యామీనన్ తన పెళ్ల గురించి క్లారిటీ ఇచ్చింది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్‌లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.