Niharika Konidela : మెగా ప్రిన్సెస్ నిహారిక కొణిదల ఈ పేరు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నిహారిక కొన్నేళ్ల క్రితం చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుంది. అయితే కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ అధికారికంగా డివోర్స్ తీసుకున్నారు. వీరిద్దరి డివోర్స్ అనౌన్స్ మెంట్ తో మెగా ఫ్యాన్స్ షాక్ అయ్యారు.అయితే నిహారిక చాలా రోజుల తర్వాత చైతన్యని కలవబోతోందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. అసలు నిహారిక ఎందుకు తన మాజీ భర్తను కలవబోతోంది అన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
మెగా డాటర్ నిహారిక యాంకర్ గా కెరీర్ స్టార్ట్ చేసింది. షోఅనంతరం హీరోయిన్ గా టాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించింది. అయితే అవి అంతగా కలిసి రాలేదు. హీరోయిన్గా పెద్దగా క్లిక్ అవ్వలేకపోయింది నిహారిక. ఇక నటిగా వర్కౌట్ కాదని ప్రొడ్యూసర్ గా మారదామని డిసైడ్ అయ్యి పలు వెబ్ సిరీసులు, సినిమాలు తీస్తోంది. కెరీర్ మధ్యలో ఉండగానే నిహారిక జొన్నలగడ్డ చైతన్య ను వివాహం చేసుకుంది. వీరి పెళ్లి వేడుకలు రాజస్థాన్ లో మెగా ఫ్యామిలీ సమక్షంలో గ్రాండ్ గా జరిగింది.
రాజస్థాన్ లో జరిగిన ఈ డెస్టినేషన్ వెడ్డింగ్ కు మెగా కుటుంబంతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. అయితే ఆ తర్వాత కొన్నాళ్లకే వీరిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.ఇక ఇప్పుడు మళ్లీ ఈ జంట కలవబోతోందని వార్తలు వస్తున్నాయి. నిహారిక కలిసేది మళ్లీ ఒక్కటి అయ్యేందుకు కాదు. అసలు మ్యాటర్ ఏమిటంటే. డివోర్స్ కి ముందు నిహారిక, చైతన్య కలిసి ఒక ల్యాండ్ కొనుగోలు చేశారట. ఇప్పుడు విడాకులు తీసుకోవడంతో ఆ ల్యాండ్ ను అమ్మాలని చూస్తున్నారట. ఆ ల్యాండ్ ఇద్దరి పేరు మీద ఉండడంతో.. ఇద్దరు సైన్ చేస్తే కానీ అమ్మే అవకాశం ఉండదు. అందుకే రిజిస్ట్రేషన్ ఆఫీస్ లో నిహారిక చైతన్యను కలవబోతోంది అంటూ న్యూస్ వైరల్ అవుతోంది.
నిహారిక ముందు సైన్ చేసిన అనంతరం చైతన్య సంతకం పెట్టి ఆ ప్రాపర్టీని సేల్ చేస్తారట. ఆ ల్యాండ్ అమ్మగా వచ్చిన డబ్బులను ఇద్దరు షేర్ చేసుకుంటారని సమాచారం. ఇక నిహారిక బ్రదర్ వరుణ్ తేజ్ ఈ మధ్యనే నటి లావణ్య త్రిపాఠి ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
ఇటలీలో వీరి పెళ్లి గ్రాండ్ గా అయ్యింది. కేవలం మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు కుటుంబ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఆ తర్వాత హైదరాబాద్ లో మెగా అభిమానులను టాలీవుడ్ పెద్దలను పిలిచి గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఇప్పుడు నిహారిక తన ప్రొడక్షన్ పనులతో బిజీగా తన లైఫ్ ను లీడ్ చేస్తోంది. ఇక చైతన్య రెండో పెళ్లి చేసుకుంటాడంటూ వార్తలు వస్తున్నాయి. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియాల్సివుంది.
Mega 158: దుబాయ్‌లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్‌గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్‌లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.